వైరల్‌: శునకాలకు ఐపీఎల్‌ ఫీవర్‌! | Dogs Playing Street Cricket Viral Video | Sakshi
Sakshi News home page

గల్లీ క్రికెట్‌ ఆడుతున్న శునకాలు

Published Sat, Sep 26 2020 3:49 PM | Last Updated on Sat, Sep 26 2020 4:45 PM

Dogs Playing Street Cricket Viral Video - Sakshi

వీడియో దృశ్యాలు

న్యూఢిల్లీ : ఐపీఎల్‌ ఫీవర్‌ యావద్ధేశానికే కాదు శునకాలకు కూడా పట్టుకుంది. అందుకే మనషులతో కలిసి గల్లీ క్రికెట్‌లో పాల్గొన్నాయి. అంతేకాదు, మనషులకు ఏ మాత్రం తీసిపోకుండా అందులోని ఓ శునకం అద్భుతంగా ఫీల్డింగ్‌ చేసి నెటిజన్లతో అవురా అనిపించుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘ బిల్‌కుల్‌ ఎలిమెంటరీ’’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ వీడియో షేర్‌ అయింది. ఇప్పటి వరకు 10 మిలియన్ల మంది ఈ వీడియోను చూశారు. ఆ వీడియోలో.. ‘‘ఎరుపు రంగు జెర్సీ ధరించిన వ్యక్తి బౌలింగ్‌ వేస్తాడు. ( ఎలుకకు అత్యంత అరుదైన గౌరవం )

ఆక్వా రంగు జెర్సీ ధరించిన వ్యక్తి బంతిని కొడతాడు. అప్పటికే ఎర్రటి జెర్సీలు ధరించిన కొన్ని శునకాలు ఫీల్డింగ్‌ చేస్తూ బంతిని పట్టుకోవటానికి సిద్ధంగా ఉంటాయి. గాల్లోకి ఎగిరిన బంతి కిందపడకుండా ఓ శునకం ఎగిరి నోటితో పట్టుకుని ప్రత్యర్థిని అవుట్‌ చేస్తుంది’’. కొద్దిగా ఫన్నీగా ఉన్న ఈ వీడియోకు ‘‘ఈ ఐపీఎల్‌ సీజన్‌లో మీరు ఏ రంగును ఎంచుకుంటున్నారు?’’ అని ప్రశ్నను జోడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement