Mahakumbh 2025: విదేశీ మహిళ ఒడిలో గణేశుడు.. ‘బ్యూటీ ఆఫ్‌ సనాతన్‌’ | A Foreign woman was Seen with the Idol of Lord Ganesha | Sakshi
Sakshi News home page

Mahakumbh 2025: విదేశీ మహిళ ఒడిలో గణేశుడు.. ‘బ్యూటీ ఆఫ్‌ సనాతన్‌’

Published Wed, Jan 15 2025 12:20 PM | Last Updated on Wed, Jan 15 2025 12:41 PM

A Foreign woman was Seen with the Idol of Lord Ganesha

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. దీనిలో పాల్గొనడానికి విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్నది.  

దేశంలో ఎవరిని కదిపినా, ఎక్కడ చూసినా కుంభమేళాకు సంబంధించిన సంగతులే వినిపిస్తున్నాయి. అలాగే మహా కుంభమేళాకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ భక్తుల ఫోటోలు,  వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. వీటిలో ఒక విదేశీ మహిళా భక్తురాలి ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది.

వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఒక విదేశీ మహిళ శాలువా కప్పుకుని, తన చేతులతో గణేశుని విగ్రహాన్ని పొదివి పట్టుకుంది. ఫొటోను చూడగానే గణేశునికి అమ్మప్రేమ అందిస్తున్న మాతృమూర్తిలా ఆమె కనిపిస్తోంది. ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లోని sarcasticschool_ అనే ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో కింద ‘2025 మహాకుంభ్‌లో గణేశుడి విగ్రహంతో విదేశీ మహిళ’ అని ఉంది.  ఈ ఫొటోను చూసిన ఒక యూజర్ కాంమెంట్‌ బాక్స్‌లో  ‘బ్యూటీ ఆఫ్ సనాతన్’ అని రాశారు. మరొక  యూజర్‌ ‘జై గణేష్’ అని రాయగా, మరొక వినియోగదారు ‘అద్భుతం’ అని రాశారు. 

ఇది కూడా చదవండి: Mahakumbh 2025: మహాకుంభమేళాలో మూడో రోజు విశేషాలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement