
దుర్గాబాయి దేశ్‌ముఖ్ భారత స్వాతంత్య్ర సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త . చెన్నై, హైదరాబాద్‌లలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను దుర్గాబాయే స్థాపించారు. రాజ్యాంగ సభలో, ప్రణాళికా సంఘంలో సభ్యురాలిగా ఉన్నారు. నేడు దుర్గాబాయి దేశ్‌ముఖ్ జయంతి. 1909 జూలై 15న రాజమండ్రిలో జన్మించారు. దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్య్ర పోరాటంలో పాల్పంచుకున్నారు. పన్నెండేళ్ల వయసులోనే ఆంగ్ల విద్యకు వ్యతిరేకంగా ఆమె పోరాటం సాగించారు.
ఆంధ్రప్రదేశ్‌కు మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని ఆ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేశారు. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను సైతం విరాళంగా అందించారు. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా విధి నిర్వహణలో ఉన్నప్పుడు.. టిక్కెట్ లేని కారణంగా నెహ్రూను ఆమె సభలోపలికి అనుమతించలేదు. కర్తవ్య నిర్వహణలో నిక్కచ్చిగా ఉన్నందుకు తిరిగి నెహ్రూ నుంచే ఆమె ప్రశంసలు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment