ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వీర విహారం చేస్తోంది. మొదట్లో లాక్‌డౌన్ విధించము అని చెప్పిన రాష్ట్రాల నాయకులే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్‌ను విధిస్తున్నారు. ఈ క్రమంలో ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ దేశంలో విధిస్తున్న లాక్‌డౌన్‌లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఢిల్లీలో ఇప్పుడున్న పరిస్థితిలో లాక్‌డౌన్ ఎత్తివేస్తే పెను విధ్వంసం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. బలరామ్ మీడియాతో మాట్లాడుతూ.. మొదట దేశంలో అధిక పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలను గుర్తించాలి. ఆపై ఆ ప్రాంతాలలో కఠినంగా లాక్‌డౌన్ను అమలు చేయాలి.
అలాగే భారతదేశంలోని 718 జిల్లాల్లో మూడింట నాలుగవ వంతు టెస్ట్-పాజిటివిటీ రేటు 10% పైన ఉంది. కనుక పాజిటివిటీ రేట్ ఉన్న జిల్లాల్లో కనీసం 8 వారాలు లాక్‌డౌన్ విధించాలి. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో దాదాపు 90 శాతం అధిక పాజిటివిటీ నమోదవుతోంది. దీని అడ్డుకోకపోతే పరిస్థితి చేయిదాటి పోతుంది. ఇక న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు టెక్ హబ్ వంటి ప్రధాన నగరాలు అధిక జనాభా కలిగిన ప్రాంతాలు కావడంతో అక్కడ కేసులు విపరీతంగా పెరగుతున్నాయి. ఇక అక్కడి ప్రభుత్వాలే కాక ప్రజలు కూడా వైరస్ కట్టడికి నివారణా చర్యలను పాటిస్తూ, లాక్‌డౌన్‌కు సహకరించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించకుండా దూరంగా ఉండి, దానిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలి వేశారు’’అని ఆయన అన్నారు.
( చదవండి: కోవిడ్ కల్లోలం: ఒక్కరోజే 4,205 మంది మృతి )
Comments
Please login to add a commentAdd a comment