ప్రతీకాత్మక చిత్రం
కొలంబో: శ్రీలంక ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన 86 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నట్లు ఆ దేశ నేవీ అధికారులు వెల్లడించారు. 11 ఫిషింగ్ బోట్ల ద్వారా వారు తమ దేశంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారని నేవీ అధికారులు మంగళవారం తెలిపారు. ఇప్పటికే శ్రీలంకలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి అక్రమంగా ప్రవేశించే వారికి వైరస్ ఉంటే అది మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో.. తమ దేశ ఉత్తర, దక్షిణ ప్రాదేశిక జలాల్లో శ్రీలంక నిఘా పెంచింది.
మన్నార్ దక్షిణ భాగాన నేవీ బలగాలు గస్తీలో ఉండగా మంగళవారం ఈ 86 మంది దొరికినట్లు నేవీ తెలిపింది. శ్రీలంక అధికారులు ఈ విషయాన్ని భారత హైకమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. 11 బోట్ల తో పాటు ఈ 86 మందిని భారత్‌కు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
చదవండి: తమిళనాడులో ఆక్సిజన్ అందక 11 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment