Indian man uses Harley-Davidson to deliver milk, Video Goes Viral - Sakshi
Sakshi News home page

నువ్వు తోపు సామీ.. పాలు అమ్మేందుకు హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌తో​.. 

Jan 7 2023 11:21 AM | Updated on Jan 7 2023 1:30 PM

Indian Man Uses Harley Davidson To Deliver Milk Video Viral - Sakshi

సోషల్‌ మీడియా అనగానే ఎన్నో స్పెషల్‌, ఫన్నీ వీడియోలు దర్శనమిస్తుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే అబ్బా ఏముంది అని అనుకుంటాము. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్యర్యానికి గురవుతున్నారు. ఇంతకీ ఏమైందంటే.. 

ప్రతీరోజు మనం చూస్తూనే ఉంటాం కదా.. పాలు అమ్మే వాళ్లు ఏదో ఒక చిన్న బైక్‌ లేదా సైకిల్‌పై వచ్చి పాలు పోసి వెళ్తుంటారు. దాదాపు చాలా మంది చిన్న బైకులనే ఉపయోగించి పాలు అమ్ముతుంటారు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం పాలు అమ్మేందుకు ఏకంగా లక్షలు విలువచేసే హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌ను ఉపయోగించాడు. ఆ బైక్‌కు రెండు వైపులా పాల క్యాన్‌లను తగిలించుకుని పాలు పోసేందుకు వీధుల్లోకి వెళ్లి వారికి పాలను అందిస్తున్నాడు. 

కాగా, ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. అమిత్‌ బదనా అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్టు చేయగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. పాలు అమ్మేందుకు రూ.11 లక్షలకు పైనే విలువ చేసే బైక్‌ను వాడుతున్నావా అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement