Karnataka: Women Spend For Days With Snake Assumes Her Husband - Sakshi
Sakshi News home page

సర్పంతో మహిళ సహజీవనం.. ఆమె సమాధానం విని ఊరంతా సైలెంట్‌!

Published Thu, Jun 9 2022 1:20 PM | Last Updated on Thu, Jun 9 2022 2:28 PM

Karnataka: Women Spend For Days With Snake Assumes Her Husband - Sakshi

పాము అంటే ఎవరికైనా భయమే. అందులో కొంతమంది ఆ పేరు విన్న పరుగులు పెడుతుంటారు. అయితే ఓ మహిళ మాత్రం తన ఇంట్లోకి వచ్చిన పాములో కలిసి ఏకంగా నాలుగు రోజులు గడిపింది. దీని వెనుక ఓ కారణం కూడా ఉంది లెండి.  ఈ వింత ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాగల్‌కోట్ జిల్లా వాడిప్పట్టి తాలూకాలోని కులహళ్లి గ్రామానికి చెందిన మోనేషా కంబారా అనే వృద్ధురాలి భర్త రెండేళ్ల క్రితం చనిపోయాడు. ఈ క్రమంలో 4 రోజుల క్రితం మహిళ ఇంట్లోకి ఓ నాగుపాము ప్రవేశించింది.

మొదట్లో పామును చూడగానే వణికిపోయింది. అయితే నాగుపాము ఇంటికి రాగానే చనిపోయిన భర్త తనను చూసేందుకు వచ్చాడని భావించి దానికి పాలు పోసింది ఆ మహిళ. ఆ తర్వాత నాలుగు రోజులు పాముతోనే ఉండిపోయింది. సమాచారం అందుకున్న స్థానికులు పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ మహిళ తన భర్త పాము రూపంలో ఉన్నాడని ఇతరులను పట్టుకోవద్దని వారిని వేడుకుంది. మరికొందరు పామును పట్టుకునేందుకు ప్రయత్నించడంతో వృద్ధురాలు కన్నీరుమున్నీరుగా విలపించింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు పామును పట్టుకునే ప్రయత్నాన్ని విరమించుకున్నారు. చనిపోయిన భర్త వచ్చాడని వృద్ధురాలు పాముతో ఉన్న ఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

చదవండి: Jubilee Hills Amnesia Pub Case: బాలిక రెండో స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement