
ముంబై : మహారాష్ర్ట డిప్యూటీ సీఎం అజిత్ సీఎం అజీత్ పవార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సలహా మేరకు ముంబైలోని ఓ ఆసుపత్రిలో పవార్‌ని చేర్పించినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. అయితే తన ఆరోగ్యం బాగానే ఉందని,అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పవార్ ఓ ప్రకటలన విడుదల చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రిలో చేరినట్లు పేర్కొన్నారు. కోవిడ్ నుంచి త్వరగానే కోలుకొని తిరిగి వస్తానని తెలిపారు.
గత కొన్నినెలల్లోనే డజనుకు పైగా మహారాష్ర్ట మంత్రులు కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. వారిలో జితేంద్ర అవద్, అశోక్ చవాన్, సుశీల్ మోదీ, ధనంజయ్ ముండే తదితరులు ఉన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మరికొంత మంది మంత్రులకు సైతం కరోనా సోకింది. ఇటీవలె అజిత్ పవార్ కూడా బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కొవిడ్ సోకినట్లు తెలుస్తోంది. (వ్యాక్సినేషన్; అదే ఉత్తమమైన మార్గం: డబ్ల్యూహెచ్‌ఓ )
Comments
Please login to add a commentAdd a comment