కోల్‌కతా: కోవాగ్జిన్ తీసుకున్న వారి విదేశీ ప్రయాణాలకు ఎలాంటి ఆటంకాలు చూడాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ’కోవాగ్జిన్‌కు విదేశాల్లో అనుమతి లేదు. విదేశాల్లో ఉన్నతచదువుల కోసం వెళ్లాలనుకుంటున్న విద్యార్థులకు సమస్యలు ఎదురవుతున్నాయి. కోవాగ్జిన్‌కు తమ దేశంలో గుర్తింపు లేదు కాబట్టి వారు వ్యాక్సిన్ తీసుకోనట్లుగానే ఆయాదేశాలు పరిగణిస్తున్నాయి.
కోవాగ్జిన్ ప్రధాని నరేంద్ర మోదీ మానసపుత్రిక... బ్రెజిల్, బంగ్లాదేశ్‌లలో సమస్యలకు కారణమైంది. కోవాగ్జిన్‌కు తక్షణం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం పొందండి లేదా ప్రపంచదేశాలు దీన్ని అంగీకరించేలా చర్యలు చేపట్టండి’ అని మమత పేర్కొన్నారు. కోవిషీల్డ్ తీసుకున్న వారికి విదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావడం లేదన్నారు. ఆక్స్‌ఫర్డ్– ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో చాన్నాళ్ల కిందటే అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment