
న్యూఢిల్లీ: జీవితంలో మన తల్లిదండ్రుల తర్వాత.. వారిలా మన బాగోగులు చూసేవారు కొందరు మనకు తారసపడుతుంటారు. వారు రక్త సంబంధీకలు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా కావచ్చు. తల్లిదండ్రుల మాదిరే వీరు కూడా మన బాగోగులు చూసుకుంటారు. అలాంటి వ్యక్తి మన స్నేహితుడైతే.. జీవితాంతం మనకు తోడుగా ఉంటాడు. అదే వ్యక్తి మన అన్న అయితే.. ఇక చెప్పాల్సిన పని లేదు.
ఎందకంటే చెల్లెళ్లు, తమ్ముళ్ల బాగుకోసం తమ జీవితాలనే త్యాగం చేసిన అన్నలేందరో ఉన్నారు మన సమాజంలో. ముఖ్యంగా చెల్లిపై అన్న చూపే ప్రేమ, అనురాగం అనంతం. అందుకే ప్రతి ఆడపిల్ల.. జీవితంలో ఏదో ఓ సందర్భంతో తనకు అన్న ఉంటే బాగుండు అని కోరుకుంటుంది. ఈ వీడియోని చూస్తే.. ఇలాంటి స్నేహితుడో, అన్నో ఉండటం నిజంగా మన అదృష్టంగా భావిస్తాం.
(చదవండి: ‘ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు తెగిస్తావా?)
పారిశ్రామికవేత్త, మారికో వ్యవస్థాపకుడు హర్ష్ మారివాలా తన ట్విటర్‌లో ఓ వీడియోని షేర్ చేశారు. ప్రాంతం ఎక్కడ.. ఏంటి అనే వివరాలు తెలియవు. వీడియోలో వర్షం పడుతుంటుంది. రోడ్డు మీద ఓ కారు ఆగి ఉంటుంది. ఇంతలో ఓ పిల్లాడు దూరం నుంచి పరిగెత్తుకు రావడం కనిపిస్తుంది. పిల్లాడి చేతిలో ఓ పాప ఉంటుంది. బయట వర్షం పడుతుండటంతో ఆ పాప తడవకుండా ఉండటం కోసం చిన్నారిని టీషర్ట్ లోపల ఉంచి.. గబగబా పరిగెత్తుకుని వచ్చి కారులో కూర్చుంటాడు పిల్లాడు.
(చదవండి: ఆకలేస్తుందన్నాడు.. సాయం చేస్తే.. చివర్లో ఊహకందని ట్విస్ట్)
ఆ తర్వాత పాపను బయటకు తీసి.. చెదిరిన తలను సరి చేస్తాడు. పాపపై ఆ చిన్నారి చూపిన ప్రేమ, సంరక్షణ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఇలాంటి నేస్తం, అన్న తోడుగా లభించిన వారు నిజంగా అదృష్టవంతులు అని కామెంట్ చేస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజనులు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇప్పటికే దీన్ని 2.3మిలియన్ల మందికి పైగా చూశారు.
చదవండి: వైరల్: 17 ఏళ్లుగా అడవిలోనే ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తి.. కారణం?
If you have people in your life who protect you like that, you are blessed!pic.twitter.com/kUvdnr0fU7
— Harsh Mariwala (@hcmariwala) October 7, 2021