ఢిల్లీ: లోక్‌సభ సమావేశాల ప్రారంభానికి ముందే బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్ విషయంలో రెండు పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సంచలన కామెంట్స్ చేశారు.
కొత్తగా ఎన్నికైన సభ్యులతో 18వ లోక్‌సభ ఈనెల 24న తొలిసారి కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని సలహా మేరకు ప్రస్తుతం ఉన్న సభ్యుల్లో ఒకరిని రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్‌గా నియమించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన ఎన్నికైన సభ్యులు అందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అయితే, ప్రస్తుత లోక్‌సభలో కాంగ్రెస్‌కు చెందిన కోడికున్నిల్ సురేష్ అత్యధికంగా ఎనిమిది సార్లు ఎంపీగా గెలుపొందారు. ఆయన కేరళకు చెందిన దళిత నేత. ఆయన్ను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు భావించారు.
కాగా, అందుకు భిన్నంగా అధికార ఎన్డీయే కూటమి వ్యవహరించింది. ఎన్నికల్లో ఏడుసార్లు గెలుపొందిన బీజేపీ నేత మెహతాబ్‌ను ప్రొటెం స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టేందుకు సిద్ధమైంది. దీంతో కాంగ్రెస్ నేతలు ఎన్డీయే ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ.. పార్లమెంట్ నిబంధనలను ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్ నిబంధనలను తుంగలో తొక్కేస్తోందన్నారు. సీనియర్ నేత సురేష్‌ను ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.
#WATCH | On BJP MP Bhartruhari Mahtab appointed pro-tem Speaker of 18th Lok Sabha, Parliamentary Affairs Minister Kiren Rijiju says, "...I have to say it with great regret that I feel ashamed that the Congress party talks like this. First of all, they created an issue about the… pic.twitter.com/iKwodsMRg3
— ANI (@ANI) June 21, 2024
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల విమర్శలపై పార్లమెంటరీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు ఇలా ప్రవర్తించడం బాధాకరం. కాంగ్రెస్ పార్టీని చూస్తే అసహ్యమేస్తోంది. ప్రొటెం స్పీకర్ అంశంలో ఇంతకు దిగజారడం కరెక్ట్ కాదు. ప్రశాంత వాతావరణంలో లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కావాలని ఆశిస్తున్నాము. అప్పుడే ఈ సమావేశాలు సరైన దిశలో సాగుతాయి. ప్రొటెం స్పీకర్‌గా మెహతాజ్ అర్హులు అని చెప్పుకొచ్చారు. ఇక, ప్రొటెం స్పీకర్ మెహతాజ్ 1998-2019 మధ్య ఒడిశాలోని కటక్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన వరుస విజయం సాధించారు. గతంలో బిజు జనతాదళలో ఉన్న మెహతాబ్.. 2024 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లోనూ కటక్ నుంచే పోటీ చేసి మరోసారి విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment