
పాకిస్తాన్ స్టాండప్ కమెడియన్ అక్బర్ చైదరి పోస్టు చేసిన ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌లాగా ఇంగ్లీష్ మాట్లాడే విధానంపై వీడియో రూపొందించాడు ఈ హాస్యనటుడు. ‘శశిథరూర్ మాదిరి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి’ అనే క్యాప్షన్‌తో ట్విటర్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో మొత్తం మూడు విధానాలుగా విభజించి వివరించాడు. మొదటి స్టెప్‌లో ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీని మిక్సీలో వేసి జ్యూస్ చేసి ఆ మిశ్రమాన్ని తాగినట్లు చూపించాడు. తరువాత స్టెప్‌లో ఓవైపు ల్యాప్‌టాప్‌లో శశి థరూర్ ఇంగ్లీష్ వీడియోలు చూస్తూ మరోవైపు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీని బ్లడ్‌లాగా శరీరంలోకి ఎక్కిస్తున్నట్లు తెలిపాడు. ఇక మూడో ప్రయత్నంలో డిక్షనరీని రోటిలో వేసి దంచి ఆ పేస్టును డ్రగ్ లాగా స్వీకరించినట్లు పేర్కొన్నాడు.
అదే విధంగా ఈ మూడు స్టేజ్‌ల తర్వాత చివర్లో కమెడియన్ అక్బర్ అచ్చం శశి థరూర్‌లాగా మాట్లాడటం ప్రారంభిస్తాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్లర్లు కొడుతోంది. లక్షలాది మంది వీక్షించగా వేలల్లో లైకులు వస్తున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్‌లు చిరునవ్వులు చిందిస్తున్నారు. అంతేగాక దీనిపై ఎంపీ శశిథరూర్ కూడా స్పందించారు. కమెడియన్ పోస్టు చేసిన వీడియోను ఎంజాయ్ చేస్తూ ఫన్నీ కామెంట్ చేశారు. నెక్స్ట్ వీడియోను పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ మీద చేయాలని కోరారు. అయితే లండన్‌లో పుట్టిన శశి థరూర్ ఢిల్లీలో గ్రాడ్యూయేట్ పూర్తి చేశారు. అంతర్జాతీయ సంబంధాలపై డాక్టరేట్ పొందారు. ఆంగ్ల భాషపై నిష్ణాతుడు అయిన థరూర్ సాధారణ ప్రజలు తమ జీవితంలో ఎన్నడూ వినని పెద్ద పెద్ద పదాలను తరుచుగా ఉపయోగిస్తుంటాడు.
🤣🙏 Next one on @ImranKhanPTI please!?> @AkbarChaudry https://t.co/nJnZ8XheDV
— Shashi Tharoor (@ShashiTharoor) February 27, 2021
Comments
Please login to add a commentAdd a comment