న్యూఢిల్లీ: ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు(ఎంఏహెచ్‌ఎస్‌ఆర్)లో భాగంగా నడిపే బుల్లెట్ రైలు చిత్రాన్ని జపాన్ రాయబార కార్యాలయం మొదటిసారిగా శనివారం విడుదల చేసింది. ముంబై–అహ్మదాబాద్ మధ్య నడవనున్న ఈ5 సిరీస్ షింకాన్‌సెన్ రైలింజన్‌కు కొన్ని మార్పులు చేయనున్నట్లు అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ముంబై, అహ్మదాబాద్‌ల మధ్య 508 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టు 2023 కల్లా పూర్తి చేయాల్సి ఉంది. సుమారు రూ.1,08,000 కోట్ల ఈ ప్రాజెక్టుకు జపాన్ ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సాయం అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment