
నాగరత్న (ఫైల్)
సాక్షి, దొడ్డబళ్లాపురం (బెంగళూరు): నెలమంగల పట్టణంలోని కేఏఎస్ అధికారి నాగరాజు భార్య గుండెపోటుతో మృతిచెందింది. నాగరాజు ఇంటిపై ఇటీవలే ఏసీబీ అధికారులు దాడిచేసి కోట్ల విలువైన నగదు, నగలు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి భార్య నాగరత్న దిగులుగా ఉంటోంది. గురువారం తెల్లవారుజామున హఠాత్తుగా ఆమెకు గుండెపోటు వచ్చింది. బెంగళూరు కొలంబియా ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స ఫలించక మృతి చెందింది. తమ ఇంటిపై వరుసగా మూడోసారి ఏసీబీ దాడి జరగడంతో ఆమె ఆ రోజే మీడియా ముందు బోరున విలపించింది.
చదవండి: (కట్నం వేధింపులకు నవ వధువు బలి)
Comments
Please login to add a commentAdd a comment