Rajiv Gandhi assassination case: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆరుగురు నిందితులను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాజీవ్ హత్య కేసులోని ఆరుగురు దోషుల్లో ఒకరైన నళిన్ శ్రీహరన్ తమిళనాడు వెల్లురూ జైలు నుంచి గతవారమే విడుదలయ్యారు. అలాగే ఆమెతోపాటు దోషులుగా ఉన్న రాబర్ట్ పయస్, రవిచంద్రన్, శ్రీహరన్, జయకుమార్, శంతనను కూడా విడుదల చేయాలని సుప్రీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఐతే ఆమెతో పాటు ఉన్న నలుగురు శ్రీలంక పౌరులు చట్టవిరుద్ధంగా భారత్‌లో ఉన్నందున్న జైలు నుంచి అధికారికంగా విడుదలైన తర్వాత కూడా తిరుచిరాపల్లిలోని ప్రత్యేక శరణార్థి శిభిరంలో ఉంచారు. అందువల్ల నళిని తన భర్తను కలవలేకపోయింది. దీంతో ఆమె శ్రీలంక పౌరులను విడుదల చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషులలో ఒకరైన నళిని మాట్లాడుతూ....తాను తన భర్తను కలవలేదని, అందువల్ల తాను విడుదలైనందుకు సంతోషంగా లేనని ఆవేదనగా చెప్పారు.
దయచేసి వీలైనంత త్వరగా తన భర్తను విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. తాము కటకటాల వెనుక ఉన్నప్పుడూ కూడా చాలామంది తమ విడుదలను వ్యతిరేకిస్తూ... మరణ శిక్షపడాలని భావించారని వాపోయారు. తాను ఆ సమయంలో రెండు నెలల గర్భవతిని అని చెప్పారు. తమది కాంగ్రెస్ కుటుంబ అని రాజీవ్ గాంధీ హత్యకు గురైనప్పుడూ తమ కుటుంబం బాధతో భోజనం కూడా చేయలేదన్నారు. రాజీవ్ గాంధీ హత్యలో తన పేరు ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నా..తనకు ఈ నింద నుంచి విముక్తి కావాలి అని విలపించారు.
(చదవండి: రాజీవ్ గాంధీ హత్య కేసు: మమ్మల్ని క్షమించండి... ఆ దారుణానికి చింతిస్తున్నా: నళిని శ్రీహరన్)
Comments
Please login to add a commentAdd a comment