
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరత, విద్యుత్ సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలో బొగ్గు నిల్వలు విద్యుత్ పరిస్థితిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బొగ్గు ఉత్పత్తిని పెంచామని అధికారులు వివరించగా, భయపడాల్సిన పరిస్థితి లేదని విద్యుత్ శాఖ మంత్రి హామీ ఇచ్చారు.
భారీ వర్షాలు, అంతర్జాతీయంగా బొగ్గు ధరల పెరుగుదల వల్లే బొగ్గు కొరత ఏర్పడిందని వివరణ ఇచ్చారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో బొగ్గు ఉత్పత్తిని పెంచామని అధికార వర్గాలు వెల్లడించాయి. బొగ్గు నిల్వల విషయాన్ని పవర్ ప్లాంట్స్ మిస్ మేనేజ్ చేశాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment