
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ(84) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి తెలిపింది. ఆయన శరీరంలోని కీలక అవయవాలు చికిత్సకు స్పందిస్తున్నాయని, ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. (చదవండి : 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు)
కాగా, ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్‌కు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందుతోంది.