PM Narendra Modi Extends Birthday Wishes To Yogi Adityanath - Sakshi
Sakshi News home page

యూపీ సీఎం పుట్టినరోజు... శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

Published Mon, Jun 5 2023 3:45 PM | Last Updated on Mon, Jun 5 2023 4:18 PM

Prime Minister Narendra Modi Wishes Yogi Adityanath - Sakshi

యూపీ ముఖ్యమంత్రి ఆదిత్య యోగినాథ్ పుట్టినరోజు సందర్బంగా "గొప్ప నాయకుడివి" అంటూ అభినందించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మేరకు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్లో యూపీలో ఆయన చేస్తోన్న ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రధానమంత్రి ట్వీట్ సారాంశమేమిటంటే... 
ఉత్తర్ ప్రదేశ్ డైనమిక్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. గడిచిన ఆరేళ్లలో అసాధారణ రీతిలో నాయకత్వం వహించి యూపీ రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోయేలా కృషి చేశారు. అన్ని ప్రమాణాల్లో యూపీ విశేషంగా అభివృద్ధి చెందింది. మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని రాశారు. 

డైనమిక్ లీడర్... 
2017లో యూపీ ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ 2022లో వరుసగా రెండోసారి కూడా అధికారాన్ని  సాధించారు.  అనతికాలంలోనే బీజేపీలో కీలక నేతగా ఎదిగిన యోగి ఈరోజు 51వ వసంతంలో అడుగుపెట్టారు. ఈ సందర్బంగా స్వయంగా ప్రధానమంత్రి ఆయనను గొప్ప నాయకుడని కొనియాడడం విశేషం.

ఇది కూడా చదవండి: అవసరమైతే మ్యాజిక్కులు చేసుకుని బతుకుతా.. రాజస్థాన్ సీఎం కౌంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement