
న్యూఢిల్లీ: ప్రజలు కోవిడ్ టీకా పొందేందుకు కోవిన్ యాప్‌లో పేరు నమోదు తప్పని సరి చేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రానికి వచ్చిన ప్రతి పౌరుడికీ కేంద్ర ప్రభుత్వం టీకా ఇవ్వాలని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రాంతాల ప్రజలకు కూడా జీవించే హక్కుందని ఆయన పేర్కొన్నారు.
డిజిటల్ సౌకర్యం, స్మార్ట్ ఫోన్ లేని సుదూర, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలు కోవిడ్ టీకా లభించక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కోవిన్ యాప్‌లో నమోదు తప్పనిసరి అనే నిబంధనను తొలగించాలని కేంద్రాన్ని ఆయన కోరారు.
చదవండి: దారుణం: మనవరాలిని చంపి.. ఆపై బామ్మ నాటకం