ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసుల సంఖ్యల రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్ర రాజధాని ముంబైలో 57 శాతం మురికివాడల్లో నివసించే ప్రజలు కరోనా బారినపడినట్లు సెరో సర్వే తెలిపింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఎఫ్ఆర్), నీతి ఆయోగ్‌లతో కలిసి చేపట్టిన సెరోలాజికల్ సర్వే పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. పురుషుల కంటే మహిళలు అధికంగా కరోనా మహమ్మారి బారినపడినట్లు తెలిపింది. ఈ సర్వేలో 8,870 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా 6936 మందిలో వైరస్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించలేదని పేర్కొంది.
ఇక ఈ నమూనాలను ముంబైలోని మూడు సాధారణ వార్డులు దాహిసర్, చెంబూర్, మాతుంగాలో సేకరిచినట్లు తెలిపారు. వైరస్ సోకి మృతి చెందినవారి శాతం తక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఇందుకోసం బీఎంసీ సమర్థవంతమైన కరోనా నివారణ చర్యలు తీసుకుందని పేర్కొంది. ముంబైలోని మురికివాడల్లో కరోనా వైరస్ అధికంగా వ్యాప్తి చెందడానికి అధిక జనసాంద్రత కలిగి ఉండడం, అదే విధంగా పారిశుద్ధ్య సౌకర్యాలు సరిగా లేకపోవడం కారణమని సెరో సర్వే వెల్లడించింది. ఈ సర్వేను జూలై 12 నుంచి 14 వరకు నిర్వహించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment