ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ పదవీకాలం పొడిగింపు | Shaktikanta Das Reappointed RBI Chief For Three Year Term | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ పదవీకాలం పొడిగింపు

Published Fri, Oct 29 2021 10:45 AM | Last Updated on Fri, Oct 29 2021 1:12 PM

Shaktikanta Das Reappointed RBI Chief For Three Year Term - Sakshi

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత్‌ దాస్‌​ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయనను ఈ పదవికి పునర్నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన 2024 డిసెంబర్‌ వరకు పదవిలో కొనసాగనున్నారు. కాగా, శక్తికాంత్‌ దాస్‌ రిజర్వ్‌ బ్యాంక్ గవర్నర్‌గా 2018 డిసెంబర్ 12వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగారు. 2021 డిసెంబర్‌లో ఆయన పదవీ కాలం ముగియాల్సి ఉంది. శక్తికాంత్‌దాస్‌ పదవీకాలం ముగియడానికి నెలన్నర రోజుల ముందే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

ఒడిషాకు చెందిన శక్తికాంతదాస్‌ 1980వ బ్యాచ్‌లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. తమిళనాడు కేడర్‌ను ఎంచుకున్న ఆయన ఆ రాష్ట్రంలో వివిధ పదవులు చేపట్టారు. ఐఏఎస్‌ అధికారిగా రిటైరయిన తర్వాత 15వ ప్లానింగ్‌ కమిషన్‌ సభ్యుడిగా కొనసాగారు. జీ 20 కూటమిలో ఇండియా తరఫున కీలక భూమిక నిర్వహించారు.

చదవండి: (రజనీకాంత్‌ ఆరోగ్యంపై స్పందించిన భార్య లతా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement