ముంబై: ముంబై నుంచి బాలీవుడ్‌ని తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని శివసేన ఆరోపించింది. అయితే అదంత సులభంగా జరిగే పనికాదని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. ప్రతిపాదిత ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్(ఐఎఫ్‌ఎస్‌సీ)ని తరలిస్తే చూస్తూ ఊరుకోమంటూ మహారాష్ట్ర సీఎం ఠాక్రే హెచ్చరించిన రెండు రోజులకే సామ్నాలో బీజేపీపై శివసేన నిప్పులు చెరిగింది. ‘బాలీవుడ్‌ని నైతికంగా కేంద్రం దెబ్బ తీస్తోంది. అలా చేసి మహారాష్ట్ర గుర్తింపుని దెబ్బకొట్టాలన్నది కేంద్రం ఆలోచన. ముంబై నుంచి ఐఎఫ్‌ఎస్‌సీని తరలించడం ఈజీగా జరగదు. ముంబై దేశ ఆర్థిక రాజధాని మాత్రమే కాదు. వినోదానికీ రాజధాని. ముఖ్యమంత్రి ఇప్పటికే ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడారు’ అని సామ్నా సంపాదకీయం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment