ఆస్పత్రి బెడ్‌పై కుక్క.. వీడియో వైరల్‌ | Stray Dog Found Relaxing On Hospital Bed In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

నేను వచ్చిన బిడ్డో సర్కారు దవాఖానకు!

Jan 19 2021 10:22 AM | Updated on Jan 19 2021 10:30 AM

Stray Dog Found Relaxing On Hospital Bed In Uttar Pradesh - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ ‘పండిత్‌ దీన్‌దయాల్‌ గవర్నమెంట్‌’ హాస్పిటల్‌లోకి ఒక వీధికుక్క ప్రవేశించింది. ‘నీకు ఇక్కడ ఏం పని?’ అని అక్కడ ఏ మానవుడు కుక్కగారిని ప్రశ్నించలేదు. అడ్డుకోలేదు. సదరు కుక్క రెండో ఫ్లోర్‌లోని ఫిమేల్‌ సర్జికల్‌ వార్డ్‌లోకి వచ్చి అక్కడ కనిపించిన ఒక బెడ్‌పైకి ఎక్కి హాయిగా సేద తీరింది.‘ఇదెక్కడి ఘోరమండి బాబూ’ అనే ఆశ్చర్యం వేడిగా హాస్పిటల్‌ సిబ్బందిని తాకింది.వారు మాత్రం అత్యంత కూల్‌గా ‘ఏదోలేండీ... వార్డ్‌లో ఎవరూ అడ్మిట్‌ కాలేదు కదా!’ అని తేలిగ్గా తీసుకున్నారు.

ఎవరో అజ్ఞాత వ్యక్తి కుక్కగారి రాజసాన్ని వీడియో తీశాడు. అది సోషల్‌ మిడియాలో వైరల్‌ అయింది. దీంతో హాస్పిటల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ అయిదు ఫ్లోర్లు దిగివచ్చి ‘జరిగిన సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించాం. బాధ్యులైన వారిపై గట్టి  చర్యలు తీసుకుంటాం’ అని గంభీరంగా ప్రెస్‌తో చెప్పాడు.స్థానికులు మాత్రం చీఫ్‌ డాక్టర్‌గారి స్టేట్‌మెంట్‌ను లైట్‌ గా తీసుకున్నారు. ‘ఇదేదో తొలిసారిగా జరిగినట్లు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆస్పత్రి ఉన్నదనేది ఎంత వాస్తవమో కుక్కల రాకపోకలు కూడా అంతే వాస్తవం’ అంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement