సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం భేటీ అయ్యారు. రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న ఆయన నేడు సాయంత్రం ప్రధానిని కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. వరద సాయం సహా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. కాగా సీఎం కేసీఆర్ ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఇటీవల కురిసిన వర్షాలతో హైదరాబాద్ తీవ్రంగా అతలాకుతలమైందని, ఈ నేపథ్యంలో జాతీయ విపత్తు నిధి నుంచి సాయం చేయాలని కేసీఆర్ అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. ఇక ఢిల్లీలో టీఆర్‌ఎస్‌కు పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించినందుకు హర్దీప్ సింగ్ పూరీకి కృతజ్ఞతలు తెలిపారు. గృహ నిర్మాణం, పౌర విమానయాన రంగాలకు సంబంధించిన ప్రాజెక్ట్‌లపై ఆయనతో చర్చించారు. పట్టణాభివృద్ధికి నిధులు, వరంగల్, సిద్దిపేటలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment