టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు | Today Top News 31 December 2020 | Sakshi
Sakshi News home page

టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు

Published Thu, Dec 31 2020 5:53 PM | Last Updated on Thu, Dec 31 2020 6:10 PM

Today Top News 31 December 2020 - Sakshi

నితీష్‌కు షాక్‌: 17 ఎమ్మెల్యేల తిరుగుబాటు!
బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ చీఫ్ నితీష్‌ కుమార్‌పై తిరుగుబాటు చేసేందుకు ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారంటూ ప్రతిపక్షం చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జేడీయూ చెందిన 17 ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ సీనియర్‌ నేత శ్యామ్‌ రాజక్‌ చేసిన ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది. పూర్తి వివరాలు..

టీడీపీ నేతల విమర్శలు పట్టించుకోం: మల్లాది విష్ణు
చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ రాజకీయాల ప్రజలు చూస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. టీడీపీ నేతలు టిడ్కో ఇళ్ల విషయంలో ప్రజలను మోసం చేశారంటూ దుయ్యబట్టారు. పూర్తి వివరాలు..

ఉపాధ్యాయులపై కేసీఆర్‌ వివక్ష: బండి సంజయ్‌
ఉద్యోగ సంఘాల నాయకులను చర్చలకు పిలిచి ఉపాధ్యాయులను మాత్రం ఆహ్వానించకపోవడానికి గల కారణం ఏంటో చెప్పాల్సిందిగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్  డిమాండ్‌ చేశారు. మొన్న జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా ఉపాధ్యాయులకు ఎన్నికల బాధ్యతలు ఇవ్వకుండా దూరం పెట్టారని, దీన్ని బట్టి వారి పట్ల కేసీఆర్‌ చూపిస్తున్న వివక్ష బట్టబయలైందని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలు..

అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు సంబంధించిన 14 వాహనాలను, వీటితో పాటు అత్యవసర పోలీస్ సేవల కోసం మరో 36 వాహనాలు ప్రారంభించారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ కార్యక్రమం ద్వారా వీటిని ప్రారంభించారు. పూర్తి వివరాలు

కీలక పరిణామం; బాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో నిందితుడైన జెరూసలేం మత్తయ్య ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. చంద్రబాబు సమక్షంలోనే ఒప్పందం కుదిరిందని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు..

ఏపీ హైకోర్టు సీజే నియామకం; నోటిఫికేషన్‌ జారీ
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను కేంద్ర న్యాయశాఖ గురువారం విడుదల చేసింది. పూర్తి వివరాలు..

ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్‌ బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్‌ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని పనిచేస్తానని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆయన లక్ష్యం మేరకు పోలవరం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలు..

జనవరి లోపు ప్రమోషన్లు పూర్తి: కేసీఆర్‌
ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన సమావేశం ముగిసింది. గురువారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఈ భేటీలో సీఎంతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని సమస్యలపై చర్చించారు. ఉద్యోగుల సాధకబాధకాలను విన్న కేసీఆర్‌.. వారి సమస్యలను త్వరలోనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. పూర్తి వివరాలు..

న్యూ ఇయర్‌ వేడుకలు.. హైకోర్టు ఆగ్రహం
నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ ప్రభుత్వం బ్యాన్‌ చేయడకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్బులకు, బార్‌లకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి ప్రజలను ఏం చేద్దామనుకుంటున్నారని ఘాటుగా ప్రశ్నించింది.  పూర్తి వివరాలు..

93 మందిని చంపేసిన సీరియల్‌ కిల్లర్‌ మృతి!
అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రొఫెషనల్‌ సీరియల్‌ కిల్లర్‌గా పేరొందిన సామ్యూల్‌ లిటిల్‌ మృతి చెందాడు. 19 రాష్ట్రాల్లో సుమారు 93 మందికి పైగా ప్రాణాలు బలిగొన్న అతడు బుధవారం మరణించాడు. ఈ మేరకు కాలిఫోర్నియా కరెక్షన్స్‌ అండ్‌ రీహాబిలిటేషన్‌ డిపార్టుమెంట్‌ ప్రకటన విడుదల చేసింది. కాగా 80 ఏళ్ల వయస్సు గల సామ్యూల్‌ వయోభారంతో చనిపోయినట్లు సమాచారం. పూర్తి వివరాలు..

వాహనదారులకు కేంద్రం శుభవార్త
వాహనదారులకు శుభవార్త తెలిపింది కేంద్ర ప్రభుత్వం. గతంలో జనవరి 1 నుండి ఫాస్ట్‌టాగ్ ను తప్పని సరిచేస్తూ తీసుకున్న నిబంధనలను మరోసారి సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం ఫాస్ట్‌టాగ్ ఉపయోగించి జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల వసూలు చేయడానికి గడువును రోడ్డు రవాణా మరియు రహదారి మంత్రిత్వ శాఖ పొడిగించింది. పూర్తి వివరాలు..

అప్పటివరకూ మేం స్నేహితులమే: సమంత
కొత్త సంవత్సరం వేడుకల కోసం టాలీవుడ్‌ క్యూట్‌‌ కపుల్‌ సమంత-నాగచైతన్యలు స్నేహితులతో కలిసి గోవాలో వాలిపోయారు. అయితే వారికి ఇష్టమైన పర్యటక ప్రాంతం గోవాలో న్యూఇయర్‌ను సెలబ్రేట్‌ చేసుకునేందుకు ఈ జంట డిసెంబర్‌ 29న గోవాకు పయనమమైన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలు..

దుమ్మురేపిన విలియమ్సన్‌‌, రహానే..
ఐసీసీ గురువారం విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ కేన్‌ విలియమ్సన్‌‌‌ సత్తా చాటాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టులో సెంచరీతో మెరిసిన విలియమ్సన్‌‌‌ టెస్టుల్లో 890 పాయింట్లతో నెంబర్‌ వన్‌ స్థానాన్ని ఆక్రమించాడు.  పూర్తి వివరాలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement