Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌ | Top10 Telugu Latest News Morning Headlines 17th June 2022 | Sakshi
Sakshi News home page

Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

Published Fri, Jun 17 2022 9:56 AM | Last Updated on Sat, Jun 18 2022 10:04 AM

Top10 Telugu Latest News Morning Headlines 17th June 2022 - Sakshi

1. అమెరికా రక్షణ శాఖలో కీలక పదవిలో రాధా అయ్యంగార్‌
ఇండియన్‌ అమెరికన్, భద్రతా నిపుణురాలు రాధా అయ్యంగార్‌ ప్లంబ్‌కు అమెరికా ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. రక్షణ శాఖ డిప్యూటీ అండర్‌ సెక్రటరీగా బైడెన్‌ సర్కారు ఆమెను నామినేట్‌ చేసింది. ఆమె ప్రస్తుతం రక్షణ శాఖలో అండర్‌ సెక్రటరీకి చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా ఉన్నారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
 రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తిస్తూ ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషల చట్ట సవరణ–2022కు సంబంధించి మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి



3. President Election 2022: వేడెక్కుతున్న రాష్ట్రపతి ఎన్నిక.. ఏకగ్రీవమా, ఎన్నికా?
రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ  క్రమంగా వేడెక్కుతోంది. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న విపక్షాల ప్రయత్నాలు కొలిక్కి రాకుండానే బీజేపీ ‘ఏకగ్రీవ’ రాగం ఎత్తుకుని పరిస్థితిని ఆసక్తికరంగా మార్చింది. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజీలో దాదాపుగా 49 శాతం ఓట్లున్న బీజేపీకి ఒకటీ అరా పార్టీల మద్దతుతో తన అభ్యర్థిని గెలిపించుకోవడం సునాయసమని భావిస్తున్నారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి



4.
 AP: మరో ముందడుగు.. విద్యలో గేమ్‌ ఛేంజర్‌! 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వేగం అనూహ్యం. ఇంత వేగంగా స్పందించిన తీరు మా అందరికీ చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. మే 25న ఆయనతో నేను తొలిసారి దావోస్‌లో సమావేశమయినప్పుడు ఆయన ఈ ఆలోచన చెప్పారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి



5. సోమేశ్‌ను తెలంగాణలోనే ఉంచాలి
 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను తెలంగాణలోనే ఉంచాలని ప్రభుత్వం హైకోర్టు కు విజ్ఞప్తి చేసింది. దీనికి ఏపీ కూడా అభ్యంతరం లేదని తెలిపిందని వెల్లడించింది. 2014 రాష్ట్ర విభజన సమ యంలో ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపులపై కేంద్రం ప్రత్యూష్‌ సిన్హా కమిటీని నియమించింది. ఈ కమిటీ కేటాయింపులపై అభ్యంతరం తెలుపుతూ కొందరు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌(క్యాట్‌)ను ఆశ్రయించి ఉపశమనం పొందారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి



6.
 Virata Parvam Movie Review: ‘విరాటపర్వం’ మూవీ రివ్యూ
టాలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. రానా, సాయిపల్లవి జంటగా నటించడం, తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు ‘విరాటపర్వం’పై ఆసక్తి పెరిగింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. IND Vs SA 4th T20: సిరీస్‌ సమం చేసేందుకు...
 మారింది... ఒక్క విజయంతో సిరీస్‌ సీన్‌ మారింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో భారత జట్టులో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. రాజ్‌కోట్‌ మ్యాచ్‌ గెలిస్తే సిరీస్‌ 2–2తో సమం అవుతుంది. అప్పుడే లక్ష్యం దిశగా భారత జట్టు అడుగు వేస్తుంది. ఈ సిరీస్‌లో... సీనియర్లు లేని టీమిండియా తొలుత డీలా పడినా గత మ్యాచ్‌లో అటు బ్యాట్‌తో... ఇటు బౌలింగ్‌తో గర్జించింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి




8. పెట్రోల్‌పై ఈ రాయితీ కూడా ఎత్తేశారహో..!
పెట్రోల్‌ కొనుగోళ్లకు డిజిటల్‌గా చేసే చెల్లింపులపై పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) ఇంతకాలం ఇస్తున్న 0.75 శాతం రాయితీని ఎత్తివేసింది. గత నెల నుంచే ఈ ప్రయోజనాన్ని నిలిపివేసినట్టు, ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు దీన్ని ఉపసంహరించుకోవడమే దీనికి కారణమని పీఎన్‌బీ తెలిపింది. ఇందుకు సంబంధించి బ్యాంకు వెబ్‌సైట్‌లో ఓ నోటిఫికేషన్‌ ఉంచింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. TTE Son Railway Guard Father Selife Pic: తండ్రీకొడుకుల అరుదైన ఫొటో.. సోషల్‌ మీడియాలో వైరల్‌
 కెమెరాలో బంధించే కొన్ని ఫొటోలు చాలా ప్రత్యేకమైనవి. వాటిని ఎప్పుడు చూసుకున్న జీవితంలోని మధుర క్షణాలను గుర్తు చేస్తాయి. అయితే తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఓ ఫొటో మాత్రం మరింత ‍ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే ఇది తండ్రీకొడుకులు తమ విధి నిర్వహణలో భాగంగా ఒకరికొకరు ఎదురైనపుడు తీసుకున్న ఫొటో.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి




10. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత
అగ్నిపథ్‌ ఆందోళన హైదరాబాద్‌కు పాకింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైల్వే స్టేషన్‌ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు.. ఫ్లాట్‌ఫారమ్‌ మీద ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement