బెంగళూరు: యూపీలోని అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. అరుణ్ సహా అతడి కుటుంబ సభ్యులకు అమెరికా వీసాను నిరాకరించింది. దీంతో, ఆయన అమెరికా పర్యటన రద్దు అయ్యినట్టు తెలుస్తోంది.
కాగా, వర్జీనియాలోని రిచ్‌మండ్‌లో ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు ప్రపంచ కన్నడ కాన్ఫరెన్స్-2024 కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ శిల్పి అరుణ్ యోగిరాజ్‌ను ఆహ్వానించారు. దీంతో, అరుణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అమెరికా వీసా కోసం రెండు నెలల కిందట అరుణ్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే, తాజాగా ఆగస్టు పదో తేదీన అరుణ్ యోగిరాజ్ వీసాను తిరస్కరించినట్లు అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. కాగా, వీసా నిరాకరణకు మాత్రం ఎలాంటి కారణాలను వెల్లడించలేదు.
ఈ నేపథ్యంలో వీసా తిరస్కరణ విషయం తెలుసుకున్న అరుణ్, అతడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేకపోవడంపై నిరాశ చెందారు. ఇక, వీసా నిరాకరణపై తాజాగా అరుణ్ స్పందిస్తూ.. వీసా ఎందుకు తిరస్కరించారో నాకు తెలియదు. కానీ, మేము మాత్రం వీసాకు సంబంధించిన అన్ని పత్రాలను సమర్చించాము అంటూ కామెంట్స్ చేశారు.
BREAKING NEWS 🚨 US refuses visa to Ayodhya Ram Lalla sculptor Arun Yogiraj.
US Embassy hasn't given any reason so far as to why it rejected the application.
Yogiraj had applied to visit an event by the Association of Kannada Kootas of America, World Kannada Conference-2024. pic.twitter.com/0EWLTqEoJQ— Satyaagrah (@satyaagrahindia) August 14, 2024
Comments
Please login to add a commentAdd a comment