వైరల్‌ : నాకే వార్నింగ్‌ ఇస్తావా.. | Video Of Mumbai Auto Driver Rams Vehicle Into Bike At Full Speed | Sakshi
Sakshi News home page

వైరల్‌ : నాకే వార్నింగ్‌ ఇస్తావా..

Published Fri, Dec 25 2020 10:13 AM | Last Updated on Fri, Dec 25 2020 12:58 PM

Video Of Mumbai Auto Driver Rams Vehicle Into Bike At Full Speed - Sakshi

ముంబై : ముంబైలోని గోవండి ఏరియాలో ఆటో డ్రైవర్‌ బీభత్సం సృష్టించాడు. తనకు వార్నింగ్‌ ఇచ్చాడన్న కోపంతో టూ వీలర్‌ వాహనంపైకి ఆటోను పోనిచ్చి దౌర్జన్యం చేశాడు. ఇదంతా అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఈ ఘటన డిసెంబర్‌ 17న చోటుచేసుకోగా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ' డిసెంబర్‌ 17న గోవండి ఏరియాలో ఆటోడ్రైవర్‌ సయ్యద్‌ సల్మాన్‌ ఆటోని ర్యాష్‌గా నడిపాడు. అదే సమయంలో బైక్‌పై వెళ్తున్న కార్తిక్‌ అనే వ్యక్తికి డాష్‌ ఇచ్చాడు. కానీ దాన్ని పట్టించుకోకుండా సయ్యద్‌ అలాగే ముందుకు వెళ్లిపోయాడు. కాగా కొద్దిరూరంలో సిగ్నల్‌ పడడంతో కార్తిక్‌ సయ్యద్‌ సల్మాన్‌ను అడ్డగించి వాదనకు దిగాడు. ఇంత ర్యాష్‌గా నడిపితే ఎలా.. రోడ్డు మీద చూసుకొని వెళితే బాగుంటుదని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన సయ్యద్‌ సిగ్నల్‌ రిలీజైన తర్వాత కార్తిక్‌ బైక్‌ను మరోసారి తోసుకుంటూ వెళ్లాడు. దీంతో అతను రోడ్డుపైనే కిందపడిపోగా హెల్మెట్‌ ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆటో నెంబర్‌ ప్లేట్‌ను గుర్తించి సయ్యద్‌ను అరెస్టు చేశాం. ర్యాష్‌గా డ్రైవింగ్‌ చేయడమే గాక హత్యకు యత్నించిన సయ్యద్‌పై సెక్షన్‌ 307, 279 కింద కేసు నమోదు చేశామని' తెలిపారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement