న్యూఢిల్లీ: భారత్‌లో తయారైన తొలి డీఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్ జైకోవ్–డీని వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ముందుగా ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై విధివిధానాలను ఖరారు చేసేందుకు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) త్వరలో ఓ సమావేశం నిర్వహించబోతున్నట్లు వెల్లడిం చారు. ఈ నెల 20న జైడస్ క్యాడిలాకు చెందిన జైకోవ్–డీ వ్యాక్సిన్‌కు భారత్‌లో అత్యవసర అనుమతులు లభించడం తెల్సిందే. 12–18 సంవత్సరాల మధ్య వయసు ఉండి, అప్పటికే పలు వ్యాధులతో బాధపడుతున్న వారికి ముందుగా ఇచ్చేలా ప్రణాళిక రచిస్తున్నారు. దేశంలో 12–18 ఏళ్ల వయసు ఉన్న వారు 12 కోట్ల మంది ఉంటారని, అందులో ఒక శాతం మంది పలు వ్యాధులతో బాధపడుతుంటారని అంచనా వేస్తున్నట్లు ఎన్టీఏజీఐ చైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా తెలిపారు. జైకోవ్–డీ వ్యాక్సిన్‌ను సూది లేకుండా మూడు డోసుల ద్వారా అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment