నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Published Thu, Oct 19 2023 1:44 AM | Last Updated on Thu, Oct 19 2023 1:44 AM

- - Sakshi

రైతుపై హమాలీ దాడి..

భైంసా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ యార్డులో సోయా విక్రయానికి తెచ్చిన రైతుపై హమాలీ దాడి చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

IIలోu

గురువారం శ్రీ 19 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2023

నిర్భయంగా ఓటేయండి

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

కడెం: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిర్భయంగా ఓటు వేయాలని కలెక్టర్‌ అశిష్‌ సంగ్వాన్‌ అన్నారు. సిస్టమేటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్ట్రోరల్‌ పార్టిసిపేషన్‌(స్వీప్‌) కార్యక్రమంలో భా గంగా మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో బుదవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మా ట్లాడారు. ఐసీడీఎస్‌, ఐకేపీ, ఈజీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఓటు హక్కు సమాజంలో అత్యంత విలువైనదని, వజ్రాయుధం లాంటి ఓటు హక్కుని ప్రతీ పౌరుడు వినియోగించుకోవాలని సూచించా రు. ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు వేయాలని తెలిపారు. అనంతరం స్థానిక మహిళలతో కలిసి కలెక్టర్‌ బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, ఏపీడీ ప్రసాద్‌, గోవింద్‌రావు, సీసీ గంగప్రసాద్‌, తహసీల్దార్‌ రాజేశ్వర్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంపీవో ఉపేందర్‌, సీడీపీవో సరిత, ఆయా మండలాల అధికారులు పాల్గొన్నారు.

గల్లీ నుంచి ఢిల్లీదాకా ఎదిగిన నేతలు

రాష్ట్రం నుంచి కేంద్రం దాకా మంత్రులు

విలక్షణ తీర్పులు ఇచ్చిన ఓటర్లు

నిర్మల్‌ నియోజకవర్గ ముఖచిత్రం

ఈసారీ ఆ ముగ్గురే..

గత మూడు ఎన్నికల నుంచి దాదాపు ఇంద్రకరణ్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, శ్రీహరిరావులే పోటీ పడుతున్నారు. 2018లో అప్పుడు బీఆర్‌ఎస్‌లో ఉన్న శ్రీహరిరావు పార్టీ ఆదేశాల మేరకు ఆ ఒక్కసారి పోటీ చేయలేదు. ఇప్పుడు నాలుగోసారి ఈ ముగ్గురే తలపడుతున్నారు. అయితే ఈసారి వాళ్ల పార్టీలు మారడం విశేషం. బీఆర్‌ఎస్‌ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి శ్రీహరిరావు బరిలో ఉన్నారు. ఇప్పటికే హోరాహోరీగా ప్రచారం, చేరికలు చేపడుతున్నారు. ఈసారి నిర్మల్‌ ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారోనని రాజకీయవర్గాలు ఎదురుచూస్తున్నాయి.

కొరిపెల్లి ముత్యంరెడ్డి

అయిండ్ల భీంరెడ్డి

గంగారాం

ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

గోపిడి గంగారెడ్డి

పొద్దుటూరి గంగారెడ్డి

పొద్దుటూరి నర్సారెడ్డి

నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌: ‘ఏ పార్టీ కా దు.. అభ్యర్థి ఏ పాటివారు..’ అని కవి కాళో జీ అన్నట్లు నిర్మల్‌కూడా పార్టీలను కాకుండా త మను ఐదేళ్లు పాలించే అభ్యర్థులను చూసి ఓటేస్తోంది. నిర్మల్‌.. 450ఏళ్ల చరిత్ర కలిగిన రాజ్యం. దాదాపు 71 ఏళ్లుగా ప్రజాస్వామ్య పద్ధతిలో పాలకులను ఎన్నుకుంటున్న ప్రాంతం. ఉమ్మడి ఆదిలాబా ద్‌ జిల్లాకే రాజకీయాలు నేర్పిన కేంద్రం. 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా నిర్మల్‌ నియోజకవర్గ రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఎంతోమంది మహానేతల రాజకీయ జీవితాలతో పెనవేసుకుంది. ఇప్పటి వరకు 16సార్లు ఎన్నికలు పూర్తిచేసుకుంది. 17వ శాసనసభ ఎన్నికలకు దాదాపు 2లక్షల 47వేలకు పైగా ఓటర్లతో సంసిద్ధంగా ఉంది.

1952 నుంచే..

స్వాతంత్య్రం వచ్చిన ఐదేళ్లకే అంటే.. 1952లో జరిగిన ఎన్నికల్లోనే నిర్మల్‌ ప్రాతినిధ్యం ఉంది. అప్పుడు ముధోల్‌ ప్రత్యేక నియోజకవర్గం కాలేదు. నిర్మల్‌తో కలిసే ద్విసభ్య(ఇద్దరు ఎమ్మెల్యేలు) నియోజకవర్గంగా ఉండేది. జనాభా, ఓటర్ల పరంగా మహిళలే ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా గెలువకపోవడం గమనార్హం.

విలక్షణ తీర్పులు..

రాజకీయ చైతన్యమున్న నిర్మల్‌ నియోజకవర్గ ప్రజలు విలక్షణ తీర్పులనిస్తున్నారు.

● స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశమంతా కాంగ్రెస్‌ హవా నడుస్తోంది. 1952లో జరిగిన ఎన్ని కల్లో నిర్మల్‌లో సోషలిస్టు పార్టీ అభ్యర్థులు గోపిడి గంగారెడ్డి, గంగారాం గెలుపొందారు. మొదటి ఎన్నికతోనే వైవిధ్యమైన తీర్పుతో నిర్మ ల్‌ ప్రజలు నాంది పలికారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలుపు ఖాయమనుకుని పోటీ చేసిన ఆర్‌.రెడ్డి, సీహెచ్‌ఆర్‌ రావు ఓడిపోయారు.

● 1957లో ముధోల్‌ ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడింది. నిర్మల్‌, దిలావర్‌పూర్‌, సారంగపూర్‌, మామడ, లక్ష్మణచాంద మండలాలతో నిర్మల్‌ నియోజకవర్గం స్వరూపం మారింది. ఇక 2016లో కొత్త జిల్లా, మండలాల ఏర్పాటు తర్వాత నిర్మల్‌అర్బన్‌, రూరల్‌, సోన్‌, నర్సాపూర్‌(జి) మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి.

● 1957లో ప్రత్యేక నియోజకవర్గాల వారీగా జరిగిన ఎన్నికల్లో పార్టీలను కాదని.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన కొరిపెల్లి ముత్యంరెడ్డిని నిర్మల్‌ నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా ఇక్కడి ప్రజలు ఎన్నుకున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆర్‌.దేశ్‌పాండేపై ఆయన గెలుపొందారు.

● 1962 నుంచి కాంగ్రెస్‌కు జైకొట్టారు. 1962లో స్వతంత్ర అభ్యర్థి పి.రెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి పొద్దుటూరి నర్సారెడ్డి విజయం సాధించారు. అనంతరం 1967లోనూ కాంగ్రెస్‌ నుంచి నర్సారెడ్డి పోటీ చేసి, స్వతంత్ర అభ్యర్థి ఎల్‌.ప్రభాకర్‌రెడ్డిపై గెలుపొందారు. ఇక 1972లో పోటీ చేయడానికే ఎవరూ ముందుకు రాలేదు. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పొద్దుటూరి నర్సారెడ్డే స్వతంత్ర అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

● 1978లో కాంగ్రెస్‌ రెడ్డి, ఇందిర కాంగ్రెస్‌లుగా విడిపోయింది. రెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన నర్సారెడ్డి, తనకు వరుసకు సోదరుడైన ఇందిర కాంగ్రెస్‌ అభ్యర్థి పొద్దుటూరి గంగారెడ్డి చేతిలో ఓడిపోయారు. అలా హ్యాట్రిక్‌ నేత నర్సారెడ్డి రాజకీయాలకు దూరమయ్యారు.

● 1983లో నిర్మల్‌ నియోజకవర్గం మరో విలక్షణ తీర్పు తీసుకుంది. కాంగ్రెస్‌ను పక్కనపెట్టి.. అప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన టీడీపీకి జైకొట్టింది. వరుస విజయాలను అందించి తెలుగుదేశం కంచుకోటగా మారింది. 1983లో టీడీపీ అభ్యర్థి అయిండ్ల భీంరెడ్డి చేతిలో కాంగ్రెస్‌ అభ్యర్థి గంగారెడ్డి ఓడిపోయారు.

● 1985 నుంచి వరుసగా.. 1989, 1994లలో టీడీపీ అభ్యర్థిగా డాక్టర్‌ సముద్రాల వేణుగోపాలచారి హాట్రిక్‌ విజయాలు సాధించారు. ఆయా ఎన్నికల్లో నర్సారెడ్డి, భీంరెడ్డినిను ఓడించారు.

● 1996లో వేణుగోపాలచారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఎంపీగా వెళ్లారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లోనూ తెలుగుదేశం సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

● 1999 నుంచి మళ్లీ కాంగ్రెస్‌వైపు ప్రజలు మొగ్గారు. టీడీపీని పూర్తిగా దూరం పెట్టేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నల్ల ఇంద్రకరణ్‌రెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి గెలుపొందారు. 2004 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి వి.సత్యనారాయణగౌడ్‌పై విజయం సాధించారు.

● 2009లో మరో ఆసక్తికరమైన.. విలక్షణమైన తీర్పుతో నిర్మల్‌ ఆకట్టుకుంది. అప్పుడే రాజకీయాల్లో అడుగు పెట్టిన సినీనటుడు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అల్లోలపై ఆయన విజయం సాధించి సంచలనం రేకెత్తించారు. అనంతరం మహేశ్వర్‌రెడ్డి ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో తానూ కాంగ్రెస్‌లోకి వెళ్లారు.

● 2014లో రాష్ట్రంలోనే సరికొత్త తీర్పుతో నిర్మల్‌ ఆకట్టుకుంది. ఓవైపు తెలంగాణ కోసం పోరాడిన టీఆర్‌ఎస్‌, రాష్ట్రమిచ్చిన కాంగ్రెస్‌ బలమైన పార్టీలుగా ఉన్నా.. ఈ రెండింటినీ కాదన్నారు. ఎక్కడో ఉత్తరభారతదేశానికి పరిమితమైన బహుజన్‌ సమాజ్‌పార్టీ(బీఎస్పీ)ని గెలిపించారు. ఆ పార్టీ అభ్యర్థిగా అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూచాడి శ్రీహరిరావుపై గెలుపొందారు.

● 2018 ఎన్నికల్లో దేవాదాయశాఖ మంత్రిగా చేసినవాళ్లు మళ్లీ గెలువలేరన్న సెంటిమెంట్‌ను తు డిచేస్తూ వరుసగా ఇంద్రకరణ్‌రెడ్డికి పట్టంకట్టారు.

రాష్ట్ర, కేంద్ర మంత్రులుగా..

నిర్మల్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రులయ్యారు. అనంతరం ఎంపీలుగానూ గెలిచి కేంద్రంలోనూ మంత్రి పదవి పొందారు.

● పొద్దుటూరి నర్సారెడ్డి రెండుసార్లు మంత్రి పదవి పొందారు. పీవీ నర్సింహారావు, జలగం వెంగళరావు హయాంలో రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ, రెవెన్యూశాఖ మంత్రిగా సేవలందించారు. 1964లో పీసీసీ అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.

● 1983లో టీడీపీ నుంచి గెలిచిన అయిండ్ల భీంరెడ్డి శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ అయ్యారు.

● 1985లో టీడీపీ నుంచి గెలిచిన డాక్టర్‌ వేణుగోపాలచారి రాష్ట్ర సమాచార, పర్యాటకశాఖ మంత్రిగా కొనసాగారు. అనంతరం 1996 లోక్‌సభ ఎన్నికలలో ఎంపీగా పోటీ చేసిన చారి కేంద్రంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ తరఫున కేంద్ర విద్యుత్‌, వ్యవసాయశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ఐడీసీ చైర్మన్‌ కొనసాగుతున్నారు.

● 2014లో బీఎస్పీ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో విలీనమైన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి అయ్యారు. 2018లో గెలిచిన తర్వాత అటవీ, పర్యావరణశాఖలు అదనం దక్కాయి.

వేణుగోపాలచారి

న్యూస్‌రీల్‌

మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్న కలెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

అవగాహన కల్పిస్తున్న ఎస్‌ఈ చౌహాన్‌2
2/4

అవగాహన కల్పిస్తున్న ఎస్‌ఈ చౌహాన్‌

3
3/4

అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి4
4/4

అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement