
● ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి
విద్యార్థుల ప్రగతిలో హెచ్‌ఎంల పాత్ర కీలకం
నిర్మల్ రూరల్: విద్యార్థుల ప్రగతిలో ప్రధానోపాధ్యాయుల పాత్ర కీలకమని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలోని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. డీఈవో కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాలను తప్పక పాటించాలన్నారు. విద్యార్థుల ప్రగతికి ప్రధానోపాధ్యాయుల సేవలు తోడ్పడుతాయన్నారు. జిల్లాలో అపార్ నమోదు, యూడైస్ ప్లస్ వివరాల నమోదును పరిశీలించారు. మధ్యాహ్న భోజన నిర్వహణ, రిపోర్టుల నిర్వహణ, ఎల్‌ఐపీ తదితర వివరాల నమోదు వివరాలు తెలుసుకున్నారు. 10వ తరగతి ఫలితాలు, ఎఫ్‌ఎల్‌ఎన్ నిర్వహణ అంశాలపై చర్చించారు. పది ఫలితాల్లో జిల్లాను ఈసారి కూడా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని సూచించారు. డీఈవో రామారావు మాట్లాడుతూ.. ప్రధానోపాధ్యాయులు ప్రతీ పాఠశాలను సందర్శించి వివరాలను సజావుగా నమోదు చేయాలన్నారు. సమీక్షలో జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ పద్మ, కోఆర్డినేటర్లు రాజేశ్వర్, నరసయ్య, ప్రవీణ్, లింబాద్రి పాల్గొన్నారు.
హాజరైన ఉపాధ్యాయులు

● ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment