రిటర్నింగ్ ఆఫీసర్లదే కీలకపాత్ర
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● ఎన్నికల విధులపై అవగాహన
నిర్మల్‌చైన్‌గేట్: త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో నామినేషన్ల స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు వరకు రిటర్నింగ్ ఆఫీసర్లదే కీలకపాత్ర అని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఆర్వో, ఏఆర్వోల విధులు తదితర అంశాలపై రి టర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. రిటర్నింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లు ఎ న్నికల విధులపై అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రోజువారీగా దాఖలైన నామినేషన్ల వివరాలను గ్రామపంచా యతీ కార్యాలయాల నోటీస్ బోర్డుపై ఉంచాలని సూచించారు. అధికారులంతా సమన్వయంతో ప నిచేసి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, డీపీవో శ్రీనివాస్, మాస్టర్ ట్రైన ర్లు, రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment