నిర్మల్
బాసరలో భక్తుల రద్దీ
బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. వివిధ సేవల ద్వారా అమ్మవారికి ఒక్కరోజే రూ.15.46 లక్షల ఆదాయం సమకూరింది.
సోమవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే గ్రామీణ ప్రాంత నిరుపేద కుటుంబాల బాలబాలికలకు భద్రతతోపాటు భవిష్యత్‌పై నమ్మకం కలిగించేలా నాలుగు అంశాలతో కార్యక్రమానికి రూపకల్పన చేశారు. విద్య, వైద్యం, ఆర్థిక అక్షరాస్యత, నైపుణ్యాభివృద్ధి, సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం కార్యక్రమ ఉద్దేశం. ముందుగా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అమలు చేసి, మున్ముందు ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లకు విస్తరించే ఆలోచనతో కలెక్టర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
భైంసాటౌన్: విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా జిల్లాలో కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తున్నారు. బాలశక్తి పేరిట రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్య, వైద్య, వైజ్ఞానిక, ఆర్థిక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. గత సెప్టెంబర్ నుంచి జిల్లాలో కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 20వేల మంది విద్యార్థులకు ఆరో గ్యపరీక్షలు నిర్వహించారు. వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న విద్యార్థుల ను గుర్తించారు. వారికి అవసరమైన చికిత్సను వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నారు. బ్యాంకింగ్ కార్యకలాపాలపై అవగాహన, ప్రభుత్వ కార్యాలయాలు, ఇండస్ట్రీల సందర్శన ద్వారా వారికి అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ఈ కార్యక్రమం సత్ఫలితాలనిస్తుండడంతో ప్రభుత్వ సీఎస్ కలెక్టర్‌ను ప్రత్యేకంగా ప్రశంసించినట్లు తెలిసింది. దీంతో ఆమె జిల్లాలో కార్యక్రమం అమలుపై సంబంధిత అధికారులను అభినందించారు.
విస్తృతంగా వైద్య పరీక్షలు
విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపడంలో భాగంగా ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో విస్తృతంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థుల ఆరోగ్య ప్రొఫైల్ రూపొందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 57 విద్యాసంస్థల్లో వైద్యపరీక్షలు నిర్వహించారు. రక్తహీనత, థైరాయిడ్, తక్కువ బరువు, ఊబకా యం, విటమిన్ లోపాలున్నవారిని గుర్తించి చికిత్స అందిస్తున్నారు. పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థినుల్లో రుతు సంబంధ సమస్యలుంటే గుర్తించి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే విద్యార్థులందరికీ కంటి పరీక్షలు నిర్వహించి, లోపాలున్నవారికి కంటి అద్దాలు అందిస్తున్నారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా సైకియాట్రిస్ట్‌తో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు.
న్యూస్‌రీల్
కలెక్టర్ చొరవతో ప్రత్యేక కార్యక్రమం సక్సెస్ కావడంతో సర్వత్రా హర్షం విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యం
జిల్లాలోని స్కూళ్లలో ఆరోగ్య పరీక్షలిలా..
ఎంపిక చేసిన పాఠశాలలు : 57
మొత్తం విద్యార్థుల సంఖ్య : 20,082
పరీక్షలు చేయించుకున్నవారు : 17,545
నమోదైన రక్తహీనత కేసులు : 384
రిఫ్రాక్టివ్ లోపాలున్నవారు : 892
నమోదైన థైరాయిడ్ కేసులు : 180
కార్యక్రమ ఉద్దేశం..
20వేల మందికి పరీక్షలు
బాలశక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రభు త్వ పాఠశాలల్లో 20వేల మందికిపైగా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, హెల్త్ కార్డులు రూపొందించాం. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు భరోసా క ల్పించాలన్న ఉద్దేశంతో పకడ్బందీగా దీన్ని అ మలు చేస్తున్నాం. విద్య, వైద్యం, నైపుణ్యం, సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
– అభిలాష అభినవ్, కలెక్టర్, నిర్మల్
వివిధ అంశాలపై అవగాహన
విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతలో భాగంగా పొదుపు బ్యాంక్ ఖాతాలు, నమూనా బ్యాంకింగ్, పిల్లల ద్వారా తల్లిదండ్రులకు ఆర్థిక నిర్వహణపై అవగాహన కల్పించడం, పొదుపు అలవాట్లను నేర్పించడం, సైబర్ భద్రతపై అవగాహన, కిడ్డీ బ్యాంక్ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధిలో భాగంగా నెక్ట్స్ స్కిల్స్ 360 ఎడ్యుటెక్ సహకారంతో జిల్లావ్యాప్తంగా 48 విద్యాసంస్థల్లో 8,9,10 తరగతుల విద్యార్థులకు అవగాహన కల్పించారు. సామాజిక సంస్థల సందర్శనలో భాగంగా విద్యార్థులకు బ్యాంకులు, పోస్టాఫీసులు, పోలీస్‌స్టేషన్, అగ్నిమాపక కేంద్రాలు, కోర్టులు, గ్రామపంచాయతీ, మండల కార్యాలయాలు, పీహెచ్‌సీలు, మీసేవలు, చిన్న తరహా పరిశ్రమలు, నీటిపారుదల ప్రాజెక్టులు, వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాల సందర్శనతో వాటి కార్యకలాపాలపై అవగాహన పెంచుతున్నారు.
నిర్మల్
నిర్మల్
నిర్మల్
నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment