జాతర ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే
జైపూర్: వేలాల జాతర ఏర్పాట్లను చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మంగళవారం పరిశీలించారు. గుట్టపై భక్తులకు తాగునీటి వసతి, ఆలయం వద్ద సౌకర్యాలు, గోదావరినదిలో పుణ్యస్నానాలు, గుట్టపైకి కాలినడక మార్గంలో వెళ్లేవారికి తాగునీరు, విశ్రాంతి సౌకర్యాలు పరిశీలించి పలు సూచనలు చేశారు. రామగుండం సీపీ శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ నేతృత్వంలో ముగ్గురు ఏసీపీలు, ఆరుగురు సీఐలు, 30 మంది ఎస్సైలు, 35 మంది ఏఎస్సైలతో పాటు 600 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల, చెన్నూర్, గోదావరిఖని ప్రాంతాల నుంచి వేలాలకు 100 ఆర్టీసీ బస్సులు కేటాయించారు.
యంత్రాల పనిగంటలు పెంచాలి
శ్రీరాంపూర్: ఓపెన్ కాస్ట్ గనిలో భారీ యంత్రాల పనిగంటలు మరింత పెంచాలని సింగరేణి డైరెక్టర్(ఆపరేషన్) ఎల్వీ.సూర్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన శ్రీరాంపూ ర్ ఓపెన్ కాస్ట్ గని సందర్శించారు. ఓసీపీలోని ఇన్‌ఫిట్ క్రషర్, సర్ఫేస్ క్రషర్లను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఓపెన్ కాస్ట్ గని నుంచి ప్రతీరోజు 4రేకుల బొగ్గు రవాణా చేయాలన్నారు. శ్రీరాంపూర్ ఏరియా మొత్తం 7 రేకుల బొగు్‌గ్ రవాణా కావాల్సి ఉందన్నారు. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జీఎం(సీహెచ్‌పీ) తిరుమల్‌రావు, ఏరియా ఇంజినీర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఓసీపీ అధికారి టీ.శ్రీనివాస్, డీజీఎంలు కేశవరావు, రవీందర్, క్వాలిటీ ఇంచార్జి కే.వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రాజెక్ట్ ఇంజినీర్ నాగరాజు పాల్గొన్నారు.
మహిళ మెడలో
పుస్తెలతాడు అపహరణ
తానూరు: మహిళ మెడలో పుస్తెల తాడు అపహరించిన ఘటన మండలంలో బోంద్రట్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. బోంద్రట్ గ్రామానికి చెందిన పంచశీల మంగళవారం వ్యవసాయ పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగివస్తుంది. ఈ క్రమంలో ఎదురుగా బైక్‌పై ముసుగు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో పుస్తెతాడును ఎత్తుకెళ్లి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
జాతర ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment