ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహిస్తాం
● ఎస్పీ జానకీ షర్మిల ● పోలీస్ అధికారులతో సమావేశం
నిర్మల్‌టౌన్: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తామని ఎస్పీ జానకీ షర్మిల పే ర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఎన్నికల భద్రత ఏర్పాట్లపై పోలీస్ అధికారులు, సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో శాంతిభద్రతలు సమర్థవంతంగా అమలయ్యేలా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 46 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 224 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్ 163 (144) సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. కేంద్రాలకు 200 మీటర్ల ప రిధిలో ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నా రు. ఎవరైనా ఎన్నికల నియమాలు ఉల్లంఘించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ఎన్నికల నియమాలు ఉల్లంఘించినట్ల యితే వారి సమాచారం ‘డయల్ 100’కు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు ఉపేంద్రరెడ్డి, అవినాష్‌కుమార్, రాజేశ్‌మీనా, ఇన్‌స్పెక్టర్లు నవీన్‌కుమార్, సైదారావు, ప్రేమ్‌కుమార్, నైలు, గోపీనాథ్, ప్రవీణ్‌కుమార్, మల్లేశ్, కృష్ణ, ఆర్‌ఐలు రామ్‌నిరంజన్, రమేశ్, రామకృష్ణ, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రం సందర్శన
జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలోగల ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ జానకీ షర్మిల సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట ఏఎస్పీ రాజేశ్ మీనా, పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్ తదితరులున్నారు.
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహిస్తాం
Comments
Please login to add a commentAdd a comment