చెరువులో యువకుడి మృతదేహం లభ్యం
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాకేంద్రంలోని ఖానా పూర్ చెరువులో యువకుడి మృతదేహం లభ్యమైనట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..పట్ట ణంలోని ఖానాపూర్‌కు చెందిన పిట్ల సాయికుమార్ (29) ఈనెల 22న ఇంటి నుంచి బ యటకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఆయన కుటుంబీకులు 25న అదృశ్యమైనట్లు ఫిర్యా దు చేశారు. గురువారం ఖానాపూర్ చెరువులో మృతదేహం నీటిపై తేలి ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు.
పేకాట ఆడుతున్న 11 మంది అరెస్ట్
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీసుస్టేషన్ పరిధి తిమ్మాపూర్‌లోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 11 మందిని ఆరెస్టు చేసినట్లు పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ప్రదీప్ ఇంట్లో బుధవారం రాత్రి దాడి చేసి 11 మందిని అదుపులో తీసుకుని వారి వద్ద నుంచి రూ.38,290 నగదు, నాలుగు బైక్‌లు, ఒక కారు, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ముగ్గురిపై రౌడీషీట్ ఓపెన్
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని క్రాంతినగర్ కు చెందిన రవితేజను హత్య చేసిన కేసులో నిందితులుగా ఉన్న గోల్డెన్ కార్తీక్, ప్రణీ త్, సాయికిరణ్‌లపై రౌడీషీట్ ఓపెన్ చేసిన ట్లు టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు తెలి పారు. ఈముగ్గురు నిందితులతో సంబంధాలు ఉండి అల్లర్లకు పాల్పడిన ఆరుగురిని ఆది లాబాద్ అర్బన్ తహసీల్దార్ ఎదుట గురువారం బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.
ఆటోబోల్తా: ఒకరికి గాయాలు
ముధోల్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ముధోల్–భైంసా ప్రధాన రహదారిపై గురువారం ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్ర ధర్మాబాద్ తాలూకా నయాగావ్ గ్రామానికి చెందిన నాగేష్ తన ఆటోలో పని నిమిత్తం భైంసాకు వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులు గమనించి 108లో భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. నాగేష్ మద్యం మత్తులో ఉండడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment