గోదావరి నదికి హారతి
బాసర: మహాశివరాత్రి సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రంలో సనాతన వేదభారతి పీఠం, వ్యవస్థాపకుడు శ్రీ వేద విద్యానందగిరి స్వామి ఆధ్వర్యంలో గురువారం వేకువజామున గోదావరి నదికి హారతి ఇచ్చారు. గంగమ్మ తల్లి, శివలింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు తరలివచ్యారు. అనంతరం వారికి వేద భారతి పీఠం ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు.
పాపహరేశ్వర ఆలయంలో..
బాసరలోని శ్రీ పాపహరేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. శివరాత్రిరోజు ఉపవాసం ఉండి భిక్షను స్వీకరించారు. అర్చకుడు నాగేష్ అప్పా తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment