న్యూస్‌రీల్‌ | - | Sakshi
Sakshi News home page

న్యూస్‌రీల్‌

Published Fri, Feb 28 2025 1:20 AM | Last Updated on Fri, Feb 28 2025 1:20 AM

-

నేడు నేత్ర వైద్యశిబిరం

నిర్మల్‌చైన్‌గేట్‌: హైదరాబాద్‌కు చెందిన గ్లోబ ల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పెన్షనర్ల సంఘ భవనంలో నేత్ర వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ లింగన్న ఓ ప్రకటనలో తెలిపారు. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్యులు పరీక్షించి అవసరమైనవారికి ఉచి తంగా ఆపరేషన్లు చేయనున్నట్లు తెలిపారు.

నేటి నుంచి కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ

నిర్మల్‌ రూరల్‌: డీఎస్సీ–2024 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు శుక్ర, శని, ఆదివారాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈవో రామారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్జీటీ ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు కస్బా హైస్కూల్‌, ఎస్జీటీ తెలుగు మీడియం ఉపాధ్యాయులకు గాజుల్‌పేటలోని పంచశీల్‌ బీఎడ్‌ కాలేజీలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement