గెలుపోటములను పట్టించుకోవద్దు
నిర్మల్‌రూరల్: ఏయే పనిలోనైనా గెలుపోటములు సాధారణమేనని.. వాటిని పట్టించుకోకుండా మన బాధ్యతలను నిర్వర్తిస్తూ ముందుకెళ్లాలని సైక్రియాటిస్ట్ అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని సోఫీనగర్ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని ముందుకుసాగాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఒత్తిడి నివారణ చర్యలు, ఆహార నియమాలను వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కవిత, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.