నిజామాబాద్‌అర్బన్: పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 372 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 79 మంది విద్యార్థులు గైర్హాజయ్యారు.
ఘనంగా రేణుక ఎల్లమ్మ 14వ వార్షికోత్సవం
నిజామాబాద్ సిటీ: నగరంలోని గౌతంనగర్ రేణుక ఎల్లమ్మ 14వ వార్షికోత్సవము కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. బుధవారం ఆలయానికి అమ్మవారి ఘటం తీసుకువచ్చి వేద మంత్రోచ్ఛరణాల మధ్య కల్యాణం నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి, పట్నాలు వేశారు. స్థానిక కార్పొరేటర్, ఆలయ కమిటీ చైర్మన్ శివచరణ్ ఉన్నారు.
ఇంపాక్ట్ ఆధ్వర్యంలో శిక్షణ
సిరికొండ: ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యచరణ తదితర అంశాలపై నిర్వహించిన శిక్షణలో సిరికొండకు చెందిన ముక్కంటి పాల్గొన్నారు. సంస్థ వ్యవస్థాపకులు గంప నాగేశ్వర్‌రావు 35 రోజుల పాటు శిక్షణ ఇచ్చినట్లు ముక్కంటి తెలిపారు. ఈ శిక్షణలో నేర్చుకున్న విషయాలపై ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. సంస్థ ప్రతినిధులు డాక్టర్ ఆదినారాయణరెడ్డి, ముక్కంటికి ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
ఆర్టీసీ చైర్మన్‌ను కలిసిన ఆదిలాబాద్ ఆర్‌ఎం
ఖలీల్‌వాడి: రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను తన నివాసంలో బుధవారం ఆదిలాబాద్ ఆర్‌ఎం జానీ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆర్టీసీ చైర్మన్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. డిపో మేనేజర్–1 ఆనంద్ ఉన్నారు.
మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం
డిచ్‌పల్లి: దేవనగర్ క్యాంప్ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి అభిషేక్ మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు. అభిషేక్ అంత్యక్రియలు బుధవారం జరిగగా.. అభిషేక్ మృతదేహానికి కాాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ రూరల్ ఇన్‌చార్జి డాక్టర్ భూపతిరెడ్డి నివాళులర్పించారు.
విజయేంద్ర స్వామి ప్రవచనాలు
నిజామాబాద్ సిటీ: నగరంలో శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఇందూరు విజయ యాత్ర కొనసాగుతోంది. కార్యక్రమంలో భాగంగా విజయేంద్ర సరస్వతి స్వామి బుధవారం నగరంలోని సార్వజనిక్ గణేశ్ ఆలయాన్ని సందర్శించారు. భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు.
పద్మశాలి సంఘానికి హాల్ వితరణ
నిజామాబాద్‌నాగారం: నగరంలోని కోటగల్లీ పద్మశాలి సంఘం–8 తర్ప వ్యవస్థాపకులు తుమ్మ మీనయ్య–రాజవ్వ జ్ఞాపకార్థం వారి మనుమళ్లు తుమ్మ సంజీవ్, శ్రీనులు ఒక హాల్‌ను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు యాదగిరి, పట్టణ అధ్యక్షులు గుజ్జేటి నర్సయ్య, జిల్లా సెక్రటరీ పుల్గం హన్మాండ్లు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment