నిజామాబాద్: బోధన్‌లోని శక్కర్‌నగర్ చౌరస్తాలో బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సోహైల్ అనే యువకుడు బాలికను ఏడాదిన్నరగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఎవరు లేని సమయంలో బాలిక ఇంట్లోకి చొరబడ్డ యువకుడిని కుటుంబ సభ్యులు పట్టుకొని పోలీసులకు అప్పగించారని చెప్పారు.
బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా సదరు యువకుడు ఏడాదిన్నరగా వేధిస్తున్నాడని, ఎవరికి చెప్పుకున్నా అండగా నిలువలేదని బాలిక తండ్రి ఓ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment