
ఎంతో మందికి అవగాహన కల్పించాం
పాలేకర్ విధానం అమలు చేస్తున్నాం. సేంద్రియ వ్యవసాయంపై ఇప్పటివరకు ఎంతోమందికి అవగాహన కల్పించడం జరిగింది. పాఠశాల విద్యార్థులు, సైంటిస్టులు, రైతులకు సేంద్రియ విధానాన్ని వివరించడంతోపాటు శిక్షణ, అవగాహన కల్పించాం. ఆర్గానిక్ పద్ధతిలోని కంది పంటను పండించడం, పసుపు ఉడకబెట్టకుండ ముక్క లు చేసి దాన్ని వినియోగించడం. ఆర్గానిక్ పంటలతో చేకూరే లాభాలను తెలియజేస్తున్నాం. దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. ఆర్గానిక్ ఫుడ్ వినియోగం పెంచాలి. అప్పుడే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండగలుగుతాం.
– పాపారావు, రైతు, పాలేకర్ విధానం