
తెలంగాణ పూల పండుగైన బతుకమ్మ వేడుకలు అమెరికాలో కాలిఫోర్నియాలో ఘనంగా నిర్వహించారు. ఒక్కొసి పువ్వేసి చందమామ, ఏమేమీ పువ్వొప్పునే గౌరమ్మ అంటూ తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మలను కొలుస్తూ మహిళలు సంబరంగా ఈ వేడుకలు నిర్వహించారు.
ఉమన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు అంచనాలకు మించిన మహిళలు హాజరయ్యారు. అక్టోబరు 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కన్నుల పండువగా బతుకమ్మ ఉత్సవాలను ఆడిపాడి నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment