
తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆధ్వర్యంలో అమెరికాలోని ఓరేగావ్ స్టేట్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. కోవిడ్ నిబంధనల కారణంగా వర్చువల్‌గా ఈ ఉత్సవాలను నిర్వహించారు. కఠిన పరిస్థితుల మధ్య మన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తున్న ఎన్నారైలను టీడీఎఫ్, పోర్ట్‌ల్యాండ్ ఛాప్టర్ అధ్యక్షుడు అనుమాండ్ల శ్రీనివాస్ కొనియాడారు.
ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించడంలో టీడీఎఫ్ పోర్ట్‌ల్యాండ్ టీం సభ్యులు సురేశ్ దొంతుల, వీరేశ్ బుక్క, శ్రీపాద్ రాంభట్ల, అజయ్ అన్నమనేని, రాజ్ ఆందోల్, మధుకర్‌రెడ్డిద పురుమాండ్ల, కొండల్‌రెడ్డి, జయ్‌అడ్ల, నిరంజన్, రఘుశ్యామా తదితరులు సహకారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment