మనకు మన చుట్టూ ఉన్న సౌకర్యాలపై అంత విలువ ఉండదు. బహుశా మనం కూడా వాటి ప్రాముఖ్యతను గుర్తించం. ఎప్పుడైతే వేరే చోటుకి లేదా ఆ వస్తువుల అవసరమైనప్పుడే మనం వాటి వాల్యూని గుర్తిస్తాం. అలాంటి అనుభవమే అమెరికాకు వెళ్లిన ఓ భారతీయుడి ఎదురయ్యింది. పైగా విదేశాల్లో ఉండే సౌకర్యాలు చూసి గొప్పగా భావించేవాళ్లు ఈ విషయం తెలుసకోండని మరీ చెబుతున్నాడు.
ఏం జరిగిందంటే..యూఎస్‌ఏ సీయాటిల్‌లో ఉన్న తమ కుమార్తె వద్దకు భారతీయ వృద్ధ దంపతులు వెళ్లారు. అయితే అతడి భార్యకి ఉన్న శ్వాసకోశ సమస్య దృష్ట్యా ముందుగానే మందులను తీసుకుని వెళ్లాం. అయితే ఆమె మందులు అయిపోవడంతో అతడు పల్మోనాలజిస్ట్‌ని సంప్రదించి మందుల తీసుకుందామని కుమార్తెతో చెప్పడంతో ఆమె అపాయింట్‌మెంట్ తీసుకుంది. అదీకూడా ఒక వారం తర్వాత వీడియోకాల్‌లోనే డాక్టర్‌తో మాట్లాడటం జరిగింది.
తాము ఉపయోగిస్తున్న మందులు గురించి వివరించడంతో సదరు డాక్టర్ అర్థం చేసుకుని తదానుగుణంగా ప్రిస్క్రిప్షన్ రాసి ఇవ్వడం జరిగింది.తీరా మందుల స్టోర్‌లో అడిగితే ఆ మందులు అందుబాటులో లేవని నాలుగు, ఐదు రోజుల్లో వస్తాయని చెప్పారు. చెప్పాలంటే ఆ మందులు తీసుకోవడం కోసం ఐదు రోజులు నిరీక్షించాల్సి వచ్చింది అతడికి. అప్పుడు తెలిసింది శ్వాసకోశ మందులు 'సిప్లా' మేడ్ ఇన్ ఇండియానే ఉత్పత్తి చేస్తుందని తెలిసి ఆశ్చర్యపోయా.
యూఎస్‌లో మెడికల్ ఇన్సూరెన్స్ ఖాతాలో 50% తగ్గింపు పొందాక కూడా ఆ మందులకు ఏకంగా రూ. 21000'/ చెల్లించాల్సి వచ్చింది. భారత్‌లో వీటి ధర రూ. 2500/-. అంటే.. అమెరికాలో ఈ మందులు ధర రూ.42000/-. అంతేగాదు ఇక్కడ డాక్టర్‌ని సంప్రదించడం కోసం, మందుల కోసం దాదాపు 12 రోజులు నిరీక్షించాల్సి వచ్చింది. అదే భారత్‌లో ఇన్ని రోజులు పట్టదు. పైగా ధర కూడా తక్కువే. చాలామంది మన దేశంలో వైద్య సదుపాయాలు బాగుండవు అని చెప్పే మిత్రులంతా ఈ విషయం తెలుసుకోవాలి. ప్రపంచంలో అత్యత్తమమైన వైద్య సదుపాయంలో మన భారతదేశం కూడా ఒకటిని తనకు అమెరికా వచ్చాక తెలుసుకున్న నిజమని ఆయన చెప్పుకొచ్చారు.
(చదవండి: ఎవరీ సుహాస్ సుబ్రమణ్యం? ఏకంగా వర్జీనియా కాంగ్రెస్ డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో..)
Comments
Please login to add a commentAdd a comment