కృష్ణా: దైవ దర్శనం కోసం 23మందితో వెళ్తున్న మినీ ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. వివరాలలోకి వెళ్తే.. విజయవాడ రూరల్ మండల పరిధిలోని కొత్తూరు తాడేపల్లికి గ్రామానికి చెందిన 23మంది పశ్చిమగోదావరి జిల్లాలోని గుబ్బలమంగమ్మ దర్శనం కోసం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మినీ ట్రక్‌లో బయలుదేరారు. డ్రైవర్ మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడంతో జి.కొండూరు శివారులోని 30వ నంబర్ జాతీయరహదారిపైకి రాగానే ట్రక్ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తాడేపల్లి గ్రామానికి చెందిన మురాల కావ్య(18), వేములకొండ జీవన దుర్గాప్రసాద్(20) అక్కడికక్కడే మృతి చెందారు.
అదేవిధంగా ఇదే వాహనంలో ప్రయాణిస్తున్న బద్రి దుర్గ, ఎ. కీర్తి, ఎ. గీత, తాలూరి సరిత, ఎం. లక్ష్మిశకుంతల, ఉప్పె స్వాతి, మట్టా వెంకటేశ్వరమ్మ, ఎం. రమాదేవి, పలగాని గోపి, వేములకొండ జగదీష్‌లకు తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న రోడ్డు భద్రతా సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను విజయవాడ తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ భరద్వాజ్‌కు ఎటువంటి గాయాలు కాకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment