చర్మకార సంక్షేమ సంఘం అధ్యక్షుడు బుల్లా రాజారావు
జి.కొండూరు: చర్మకారుల కుటుంబాల ఆర్థికాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చర్మకార సంక్షేమ అభివృద్ధి సంస్థ(లిడ్ క్యాప్)కు కూటమి ప్రభుత్వం రూ.300 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర చర్మకార సంక్షేమ సంఘం అధ్యక్షుడు బుల్లా రాజారావు అన్నారు. జి.కొండూరులో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజారావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లిడ్ క్యాప్‌కు చెందిన స్థలాలు, భవనాలు అన్యాక్రాంత మవుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి కబ్జాకు గురైన స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకొని లిడ్ క్యాప్‌కు కేటాయించాలని కోరారు. అన్ని జిల్లాల్లో లెదర్ పార్కులను నిర్మించి చర్మకారుల జీవితాలలో వెలుగు నింపాలన్నారు. చర్మకారులు, డప్పు కళాకారులకు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.2లక్షలను ఆర్థికసాయంగా అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. జి.కొండూరు మండల పరిధి వెల్లటూరు గ్రామంలో మినీ లెదర్ పార్క్ నిర్మాణానికి రెండేళ్ల క్రితం రూ.5.5 కోట్లు నిధులు విడుదలయ్యాయని, పార్కు నిర్మా ణం వెంటనే ప్రారంభించాలన్నారు. కార్య క్రమంలో లిడ్ క్యాప్ పరిరక్షణ సమితి ఉమ్మడి కృష్ణాజిల్లా కార్యదర్శి బట్టపర్తి రాజు, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కురగంటి రాంబా బు, రాష్ట్ర చర్మ కార సంక్షేమ సంఘం కార్యదర్శి బుల్లా రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment