సుస్థిర ఆదాయం ఇచ్చే పంటలు సాగుచేయాలి
జి.కొండూరు: సుస్థిర, అధిక ఆదాయం ఇచ్చే పంటలను రైతులు సాగుచేస్తే ఆర్థికంగా బలో పేతమవుతారని రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్ర మల శాఖ డైరెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు సూచించారు. మైలవరం నియోజకవర్గంలో ఆయన సోమవారం పర్యటించారు. జి.కొండూరులోని టమాట, మైలవరం మండలం పుల్లూరులో మల్లెతోటలు, రెడ్డిగూడెం మండలం రంగాపురంలో మామిడితోటలు పరిశీలించారు. ఆయా గ్రామాల్లో రైతుల సమస్యలు, ధరల్లో తేడా, మార్కెటింగ్ ఇబ్బందులపై ఆరా తీశారు. ఉద్యాన పంటలకు ప్రభుత్వం అందించే రాయితీలు, డ్రిప్ ఇరిగేషన్, నాణ్యమైన దిగుబడులను పొందేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సూక్ష్మసేద్య అధికారి పి.ఎం.సుభాని, ఎన్టీఆర్ జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఏపీ హంసా ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యదర్శిగా రమా
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అసోసియేషన్ (ఏపీహంసా) ఉమ్మడి కృష్ణాజిల్లా కార్యదర్శిగా పి.వెంకట రమణ (రమా) నియమితులయ్యారు. విజయవాడలోని కొత్త ప్రభుత్వాస్పత్రిలో సోమవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అరవ పాల్, కోశాధికారి వై. శ్రీనివాస్‌తో పాటు ఉమ్మడి కృష్ణా అధ్యక్షుడు వినుకొల్లు రామకృష్ణ, సిటీ అధ్యక్షురాలు జాలం సరోజిని, కార్యదర్శి బొమ్మగంటి రాంబాబు, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కార్యద ర్శిగా నియమితులైన వెంకట రమణను అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.
స్టైపెండ్ పెంచాలని
వెటర్నరీ విద్యార్థుల వినతి
గన్నవరం: స్టైపెండ్ పెంచాలని ఎన్టీఆర్ పశువైద్య కళాశాల విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆందోళనలో భాగంగా విద్యార్థులు సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశను కలిసి స్టైపెండ్ పెంచాలని వినతిపత్రం అందజేసి, తమ సమస్యలను విన్నవించుకున్నారు. మెడికల్, డెంటల్, ఆయుష్ విద్యార్థులకు రూ.25 వేల స్టైపెండ్ చెల్లిస్తున్న ప్రభుత్వం వెటర్నరీ విద్యార్థులకు రూ.7 వేలే ఇస్తోందని పేర్కొన్నారు. ఈ అరకొర స్టైపెండ్ చాలక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. మూగజీవాలకు వైద్య సేవలందించేందుకు వెటర్నరీ కోర్స్ అభ్యసిస్తున్న తమపై నిర్లక్ష్యం తగదన్నారు. ప్రభుత్వం స్పందించి రూ.15 వేలకు స్టైపెండ్ పెంచాలని కోరారు. విద్యార్థి నాయకులు పునీత్, భానుప్రకాష్, తిరుమల, లోహిత తదితరులు పాల్గొన్నారు.
ఓపెన్ స్కూల్ పరీక్షలకు 539 మంది గైర్హాజరు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు సోమవారం 539 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 17 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 2496 మంది విద్యార్థులకు 1957 మంది హాజరయ్యారు. భౌతికశాస్త్రం, రాజనీతిశాస్త్రం, మనోవిజ్ఞానశాస్త్రం తదితర సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరిగాయి. విద్యాపీఠం రాష్ట్ర సంచాలకుడు శివకోటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి యు.వి.సుబ్బారావు పలు పరీక్ష కేంద్రాలను సందర్శించారు.
సుస్థిర ఆదాయం ఇచ్చే పంటలు సాగుచేయాలి
సుస్థిర ఆదాయం ఇచ్చే పంటలు సాగుచేయాలి
Comments
Please login to add a commentAdd a comment