అర్జీల పరిష్కారంలో అగ్రస్థానంలో నిలపాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్‌ఎస్)కు ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కార నాణ్యతలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు కృషిచేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని శ్రీపింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమ వారం పీజీఆర్‌ఎస్ జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, గ్రామ/ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌కు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నాణ్యతా ప్రమాణాల మేరకు పరిష్కరించడం ప్రధానమని పేర్కొన్నారు. అధికారులు అర్జీదారునితో నేరుగా మాట్లాడి, సమస్య పరిష్కారానికి కృషిచేయాలన్నారు. అర్జీల పరిష్కార నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారిస్తోందని, డివిజనల్, మండలస్థాయిలోనూ గ్రీవెన్స్‌డేను సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
అర్జీల వెల్లువ
పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 152 అర్జీలు అందాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా 60 అర్జీలు అందాయని పేర్కొన్నారు. శాఖల వారీగా డీఆర్‌డీఏకు సంబంధించి 16, పోలీస్ శాఖ 14, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ 13 అర్జీలు, పౌర సరఫరాలు, గృహ నిర్మాణం, సర్వే విభాగాలకు ఐదు చొప్పున, విద్య, పంచాయతీరాజ్ శాఖలకు నాలుగు చొప్పున, వైద్య ఆరోగ్యం, బ్యాంకింగ్ సేవలు, సాంఘిక సంక్షేమానికి మూడు చొప్పున, కళాశాల విద్య, ఆర్ అండ్ బీ, గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించి రెండు చొప్పున అర్జీలు అందాయి. మిగిలిన అర్జీలు పశుసంవర్ధక శాఖ, ఏపీఈడబ్ల్యూఐడీసీ, జెడ్‌పీ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, ఉపాధి కల్పన, అడవులు, భూగర్భ జలాలు, ఐసీడీఎస్, మైనారిటీ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, ఖజనా తదితర విభాగాలకు ఒక్కో అర్జీ చొప్పున వచ్చాయి. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment