అంతర్జాతీయ జలక్రీడలకు నాగాయలంక యువతి
నాగాయలంక: థాయిలాండ్‌లో శుక్రవారం నుంచి నిర్వహించనున్న అంతర్జాతీయ జలక్రీడల్లో ఏపీ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో కెనోయింగ్ కయాకింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున కెనోయ్ స్లాలమ్‌లో పాల్గొనేందుకు నాగాయలంక వాటర్ స్పోర్ట్స్ క్రీడాకారిణి నాగిడి గాయత్రి ఎంపికై ంది. ఇప్పటికే థాయిలాండ్ చేరుకున్న ఈ యువతి స్లాలమ్ ఈవెంట్‌లో సీనియర్, జూనియర్ విభాగాలలో పాల్గొంటుందని అసోసియేషన్ అధ్యక్షుడు బలరామ్ నాయుడు, అడ్వయిజర్ తిప్పిరెడ్డి శివారెడ్డి ద్వారా గురువారం తెలిసింది. గాయత్రి 2023లో గోవాలో జరిగిన నేషనల్ గేమ్స్‌లో రజత పతకం, ఈ ఏడాది గత నెలలో ఉత్తరాఖండ్ రాష్ట్రం శివపురి ప్రాంతంలోని గంగానదిలో జరిగిన నేషనల్స్‌లో బంగారు పతకం సాధించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో జలక్రీడలకు ఎంపికై న గాయత్రిని ఈ ప్రాంతంలో పలువురు ప్రముఖులు అభినందించారు. పతకాలతో తిరిగిరావాలని అభిలషించారు.
కొనసాగుతున్న పశువైద్య విద్యార్థుల రిలే దీక్షలు
గన్నవరం: ఉపకార వేతనాలు పెంచాలని స్థానిక ఎన్టీఆర్ పశువైద్య కళాశాల విద్యార్థులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 33వ రోజుకు చేరుకున్నాయి. కళాశాల ఎదుట బైఠాయించిన పశువైద్య విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. ఈ సంద ర్భంగా వెటర్నరీ విద్యార్థినులు ఐశ్వర్య, మృదు ల, హరిత, కోమలి మాట్లాడుతూ మెడికల్, డెంటల్ విద్యార్థులకు రూ. 25 వేలు వరకు స్టైఫండ్ ఇస్తున్న ప్రభుత్వం వెటర్నరీ విద్యార్థులకు మాత్రం గత పదమూడేళ్లుగా రూ. 7 వేలు చొప్పున చెల్లిస్తుండడం అన్యాయమన్నారు. ఉపకార వేతనాలు పెంచాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకునేవారే కరువయ్యారని వాపోయారు. ఇప్పటికై నా స్పందించి స్టైఫండ్‌ను కనీసం రూ. 15 వేలకు పెంచాలని, ఈ దిశగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
కదం తొక్కిన కోకో రైతులు
ఏలూరు (టూటౌన్): కంపెనీలు సిండికేట్‌గా మారి కోకో గింజల ధర తగ్గిస్తున్నాయంటూ ఏలూరులో రైతులు కదం తొక్కారు. చలో ఏలూరు కార్యక్రమంలో భాగంగా రైతులు ర్యాలీ, మహాధర్నా చేపట్టారు. ముందుగా ఫైర్‌స్టేషన్ మీదుగా ఉద్యాన శాఖ డీడీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ధర్నాను ఉద్దేశించి ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కిలోకు రూ.900 ధర ఇప్పించాలని, సిండికేట్‌గా మారిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందుకున్న కలెక్టర్ వెట్రిసెల్వి రైతులతో చర్చలు జరిపి వారి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. ఏలూరుతో పాటు పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల రైతులు భారీగా తరలివచ్చారు.
అంతర్జాతీయ జలక్రీడలకు నాగాయలంక యువతి
అంతర్జాతీయ జలక్రీడలకు నాగాయలంక యువతి
Comments
Please login to add a commentAdd a comment